అలాంటి సందర్భంలో కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం “కృష్ణ నెంబర్ వన్”. ఈ సినిమాలో కృష్ణగారు చూసినవారికి నమ్మశక్యం కాకుండా 25 ఏళ్ల యువకుడిలా కనబడారు. ఈ సినిమాలో ఆయన ఎన్నో వైవిధ్యమైన గెటప్స్‌లో దర్శనమిచ్చారు—అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో వేషాలు వేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కానీ టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే వివాదం చెలరేగింది. “కృష్ణ నెంబర్ వన్ హీరోనా? అందుకే టైటిల్ పెట్టారా?” అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. “చెత్త టైటిల్… సినిమా సంకనాకిపోద్ది” అంటూ కౌంటర్లు వేసిన వారు కూడా ఉన్నారు. టైటిల్ కారణంగా సినిమా బోర్ అవుతుందని పలువురు ముందే తేల్చేశారు.
కానీ… సినిమా రిలీజ్ అయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రజలు థియేటర్లకు కుమ్ముకుని వచ్చారు. షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దద్దరిల్లే బ్లాక్‌బస్టర్ హిట్ గా మారింది. విమర్శించిన వాళ్లే చివరికి నోరు మూసుకునే పరిస్థితి అయ్యింది. కృష్ణగారి ఎనర్జీ, గెటప్స్, హాస్యం—ప్రతి ఫ్రేమ్‌లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన నటించిన సౌందర్య కూడా తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. పాటలు భారీ హిట్ అయ్యాయి. ప్రత్యేకంగా కృష్ణగారి లుక్, డిఫరెంట్ అప్రోచ్ ఈ చిత్రాన్ని అభిమానుల హృదయాల్లో ఇంకా నిలిపాయి.మొత్తానికి… “టైటిల్ చెత్తగా ఉంది” అని నవ్వుకున్న వాళ్లే రిలీజ్ రోజున సినిమా కలెక్షన్లు, హంగామా చూసి షాక్ అయ్యారు. కృష్ణ నెంబర్ వన్ నిజంగా కృష్ణగారికి మరో నెంబర్ వన్ విజయాన్నే ఇచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి