ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో కలిసి ఓ వరల్డ్ క్లాస్ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్సమెంట్ వచ్చిన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘జవాన్’తో దేశవ్యాప్తంగా తన మార్క్ చూపిన అట్లీ, అల్లు అర్జున్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం మాత్రం ఇంకా ఒక రేంజ్‌లో ఉండబోతుందనే బజ్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.  ఈ సినిమా కోసం ఇంటర్నెషనల్ అభిమానులు కూదా వెయిట్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో అట్లీ ఎంతో కేర్ ఫుల్‌గా, పెద్ద స్కేల్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోబోతుంది అంటున్నారు.


సినిమా నుంచి బయటకు వచ్చే ప్రతి చిన్న అప్డేట్‌ కూడా అభిమానుల్లో పూనకాలే తెప్పిస్తోంది. అట్లీ–బన్నీ కాంబినేషన్‌లో ఏదో ఒక సంచలనమే చూడబోతున్నామనే నమ్మకం పెరుగుతోంది. ఈ సినిమాకోసం అల్లు అర్జున్ తన బెస్ట్‌ అందించేందుకు గట్టిగా కష్టపడుతున్నాడని అతని వర్కౌట్ క్లిప్స్, జిమ్ ఫోటోస్ స్పష్టంగా చెబుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన బన్నీ జిమ్ పిక్, అతని ఫోన్ వాల్‌పేపర్‌గా ఉన్న ఫోటో—ఇవి చూస్తే ఆయన యాక్షన్ షెడ్యూల్ కోసం ఎంత రేంజ్‌లో తయారవుతున్నాడో అర్థమవుతోంది.

 

ప్రస్తుతం అల్లు అర్జున్ స్టన్నింగ్ ఫిజిక్ కోసం స్పెషల్‌గా పనిచేస్తున్నాడని, మళ్లీ ఒకసారి 6 ప్యాక్ లుక్స్‌తో స్క్రీన్‌పై కనిపించినా ఎలాంటి ఆశ్చర్యం లేదని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.“బన్నీ లుక్ వచ్చిందంటే మిగతా స్టార్స్ కుల్లుకుని చచ్చిపోతారు” అంటూ నెటిజన్లు ఇప్పటికే కామెంట్స్ వేస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక క్లారిటీ మాత్రం త్వరలోనే రానుందని టాక్. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అట్లీ–అల్లు అర్జున్ కాంబోకు పాన్ ఇండియా లెవెల్‌లో భారీ హైప్ నెలకొనగా, ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలు రాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: