నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ సినిమా అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అర్చనలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి కాగానే బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే బాలయ్య , గోపీచంద్ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా బాలయ్య , గోపీచంద్ కాంబో మూవీ లో నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. దానితో ఈ సినిమాపై అంచనాలు మరింత గా పెరిగి పోయాయి.

అందుకు ప్రధాన కారణం ... బాలయ్య , గోపీచంద్ కాంబో లో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయం అందుకొని ఉండడం , అలాగే బాలయ్య , నయనతార కాంబో లో రూపొందిన సింహ , శ్రీరామ రాజ్యం , జై సింహ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ క్రేజీ కాంబో లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరి పోయాయి. ఇది ఇలా ఉంటే బాలయ్య , గోపీచంద్ కాంబో లో రూపొందబోయే సినిమాలో నయన తార అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... గోపీచంద్ , బాలయ్య హీరో గా పిరియాడిక్ డ్రామాను రూపొందించబోతున్నట్లు , అందులో నయనతార రాణి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: