తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రవిబాబు ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకునే దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవి బాబు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన ఓ సినిమా ప్రమోషన్లు చేసిన విధానానికి నాకు తిట్లు అయ్యాయి అని ఆయన చెప్పుకొచ్చాడు.

తాజాగా రవి బాబు ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం అవును అనే సినిమాను రూపొందించాను. ఇక ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పెద్ద కష్టాల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సినిమాలో హీరోయిన్ చాలా పెద్ద కష్టం లో ఇరుక్కుపోయింది ఎలా చూపించాలి అనే ఉద్దేశంతో భూమి మీద ఉన్న అత్యంత పెద్ద జంతువు ఏనుగు. అలా ఏనుగు అమ్మాయిని పట్టుకున్నట్లు ఒక ఫోటోను క్రియేట్ చేసి దానిని పబ్లిసిటీ చేశాం.

ఇక సినిమా విడుదల అయ్యాక ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి సార్ సినిమా అలా తీశారు. సినిమా ప్రమోషన్లలో ఏనుగు తో హీరోయిన్ ఉన్నట్లు వేశారు. కానీ సినిమాలో చూస్తే ఏనుగు లేదు. అలా ఎలా తీస్తారు సార్ అని అన్నాడు. దానితో నేను సినిమాలో హీరోయిన్ చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంది. ఆ అమ్మాయి చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంది అని చెప్పడం కోసం అలా క్రియేట్ చేసాం అని ఆయనకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. అలా అవును సినిమా ప్రమోషన్ల వల్ల నేను ఒక వ్యక్తితో తిట్లు తిన్నాను అని రవి బాబు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: