ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఒకే వేదికపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య గతంలో పలుసార్లు అభిప్రాయ భేదాలు, వివాదాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా సమయంలో రేవంత్ రెడ్డి బన్నీని టార్గెట్ చేశాడని, అరెస్ట్ చేయించ్హడంటూ ఏర్పడిన రాజకీయ ఆరోపణలు అప్పట్లో పెద్ద హడావుడి చేశాయి. తరువాత పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ ఎదురుపడిన సందర్భాల్లో కూడా కొన్ని చిన్నపాటి టెన్షన్ మూమెంట్స్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఇద్దర్ని బాలయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించడం పెద్ద రిస్క్ అని, ఇది హాట్ టాపిక్ అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక స్పష్టత మాత్రం ఇంకా మేకర్స్ ఇవ్వలేదు.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘అఖండ 2 – తాండవం’ ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిమానులు, ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాకోసం భారీ ఎక్సైట్మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి