సితారని మహేష్ బాబు నమ్రతలు ఇంకా ఇండస్ట్రీకి కి పెద్దగా లాంచ్ చేయలేదు. కేవలం ఆమె పలు యాడ్స్ ద్వారానే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది.అలా తల్లిదండ్రులు ఇండస్ట్రీకి పరిచయం చేయకపోయినప్పటికీ తనకు తానే పరిచయమైన బ్యూటీ సితార అని చెప్పుకోవచ్చు. అయితే సితార ఫ్రీడం గురించి తాజాగా ఓ నటి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. సీతారని ఇండస్ట్రీకి పంపించకపోతే కచ్చితంగా మహేష్ బాబు నమ్రత ఇద్దరిని కలిపి కొడతాను అంటూ ఆ నటి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ ఆ నటి ఎవరంటే మంచు లక్ష్మి..మంచు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సితారని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నమ్రత మహేష్ బాబు ఇద్దరిని నేను కొడతాను. 

ఎందుకంటే చాలామంది హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి రానివ్వరు. కొడుకులను మాత్రమే ఇండస్ట్రీలోకి వారసులుగా తీసుకువస్తారు.కానీ ఈ విషయం నేను అస్సలు ఒప్పుకోను. కూతుర్లను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలి. నమ్రత మరాఠీ మాతృస్వామ్యంలో పెరిగింది. ఆమెలో ఎన్నో ఆధునిక భావాలు ఉన్నాయి.. అందుకే సితారకి కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.లేకపోతే మహేష్ నమ్రతలను కొట్టేస్తాను. సినీ ఇండస్ట్రీలో కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలనేదే నా ఉద్దేశం. నేను పితృ సౌమ్యాన్ని తొలగించలేను.

కానీ దానిని ఛేదించే మార్గం కనుగొనాలి అంటూ మంచు లక్ష్మి మాట్లాడింది. అయితే మంచు లక్ష్మి మాటల వెనుక బలమైన సందేశమే ఉంది. ఇండస్ట్రీలోకి వారసులనే కాదు వారసురాళ్లను కూడా పరిచయం చేయాలన్నదే ఆమె మాటలు వెనుక ఉన్న అర్థం. అందుకే సితారను ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని మంచు లక్ష్మి చెబుతోంది. మరి మహేష్ బాబు అందరు హీరోల్లాగే తన కూతుర్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారా.. లేక కూతుర్ని సినిమాల్లోకి హీరోయిన్ గా తీసుకువచ్చి మంచు లక్ష్మి కోరిక తీరుస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: