అక్కినేని నాగార్జున భార్య అమల ఎక్కువగా బయట మీడియా ముందు కనిపించదు. ఆమె పని ఏంటో ఆమె చూసుకుంటూ ముందుకు వెళ్తుంది.. అలాగే ఎక్కువగా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనదు. అయితే అలాంటి అమల తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది.. ఫస్ట్ టైం అమల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యం తల్లిదండ్రుల గురించి చెప్పి ఎమోషనల్ అయింది.మరి ఇంతకీ అమల బాల్యం ఎలా సాగింది.. ఆమె తల్లిదండ్రులు ఎవరు అనేది ఇప్పుడే చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితం లో మొదటి గురువు అనేది తల్లిదండ్రులే..అలా నా జీవితంలో కూడా తల్లిదండ్రులే మొదటి గురువులు అంటూ తన ఇంటర్వ్యూ ను మొదలు పెట్టింది అమల.. మా నాన్న వాళ్లు మొత్తం పదిమంది.. 

ఈస్ట్ బెంగాల్ నుండి పార్టిషన్ టైంలో ఇల్లు ఆస్తి పూర్తిగా వదిలేసి రాత్రికి రాత్రే మా నాన్న ఉత్తర ప్రదేశ్ కి వచ్చేసారు. అలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉత్తరప్రదేశ్ కి నాన్న 10 ఏళ్ల వయసులో వచ్చారు. అలా పదిమంది ఉన్నవారి కుటుంబంలో స్కాలర్షిప్ పై చదువుకుంటూ యూనివర్సిటీ చదువు వరకు వచ్చారు. అలా ఈ యూనివర్సిటీలో నాన్న అమ్మను కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇప్పటివరకు అమ్మ నాన్న ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అమ్మ నాన్న వాళ్ళ లాభం పొందిన వారే ఉన్నారు కానీ నష్టపోయిన వారు లేరు. వారికి ఎవరిని బాధ పెట్టడం తెలియదు. నాకు ఏడు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు మేం వైజాగ్ వచ్చాం.ఆ టైంలో అమ్మ భరతనాట్యం క్లాసుల్లో చేర్పించింది.

ఇక భరతనాట్యం క్లాస్ కి వెళ్ళిన సమయంలో గురువుగారు నన్ను చూసి ఈమెలో ఓ కల ఉంది. కచ్చితంగా మంచి పొజిషన్ కి వస్తుంది. కళాక్షేత్రకు తీసుకెళ్లండి అని చెప్పారు. అలా గురువుగారి మాటలతో అమ్మ నన్ను చెన్నైలోని కళాక్షేత్రలో అడ్మిషన్ తీసుకొని అక్కడే ఉంచింది.అలా దాదాపు తొమ్మిది సంవత్సరాలు కళాక్షేత్రలో ఉంటూ నాట్యం నేర్చుకుంటూనే చదువుకున్నాను. ఇక స్కూల్ కాలేజీ ఇలా చాలా సందర్భాలలో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు ఇచ్చాను.అలాగే ఇండియా తరపున విదేశాల్లో క్లాసికల్ డాన్స్ చేస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపించేది. నేను ఐదు భాషలు అలవోకగా మాట్లాడుతాను. భారతదేశం అంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే ఎక్కడికి వెళ్ళినా తొందరగా అడ్జస్ట్ అవుతా..అంటూ అమల మొదటిసారి తన బాల్యం, తల్లిదండ్రులు, నృత్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: