తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ.లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో వెంకీ అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చాడు. ఇకపోతే వెంకటేష్ తన తదుపరి మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను డిసెంబర్ 15 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్లో వెంకటేష్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాలో వెంకటేష్ కు సంబంధించిన పోర్షన్ కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక మన శంకర వర ప్రసాద్ గారు సినిమా లోని వెంకటేష్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి.కాగానే వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: