టాలీవుడ్ అందగాడిగా ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఒకప్పుడు గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాల్లో, సీరియల్స్ లో కీరోల్స్ పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే.చిరంజీవి,నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోల తరానికి చెందిన ఈయన వాళ్ల అంతటి గుర్తింపు సంపాదించినప్పటికీ ఎందుకో ఆయన స్టార్డం ని కాపాడుకోలేక పోయారు. అయితే మెగాస్టార్ అంతటి గుర్తింపు తెచ్చుకున్న సుమన్ కెరియర్ని నాశనం చేసింది బ్లూ ఫిలిమ్స్ కేస్.. ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్న సుమన్ పై కొంతమంది పగబట్టి బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించారు. కానీ రెండు మూడు నెలలు ఈ కేసులో జైల్లో ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటకు తిరిగివచ్చారు. కానీ ఒకసారి మచ్చ పడితే అది ఎప్పటికీ చెరిగిపోదు అన్నట్లు ఆ బ్లూ ఫిలిమ్స్ కేస్ ఆయన జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది. 

చివరికి ఆయనకు అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అయితే అలాంటి సుమన్ బ్లూ ఫిలిమ్స్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో చాలామంది మెగాస్టార్ చిరంజీవిని అనుమానించారు. చిరంజీవి కావాలనే సుమన్ ని ఇరికించారని,ఎక్కడ తనకంటే ఎత్తుకు ఎదుగుతాడో అనే భయంతో చిరంజీవే ఈ పని చేయించాడు అని ఆరోపణలు వచ్చాయి.కానీ ఈ విషయంలో సుమన్ స్వయంగా క్లారిటీ ఇచ్చి బ్లూ ఫిలిమ్స్ కేసుకి చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదని అసలు నిజం బయటపెట్టారు. దాంతో చిరంజీవికి ఆయన కేసుకి ఎలాంటి సంబంధం లేదని అందరికీ అర్థమైంది. అయితే ఇప్పట్లో కొంతమంది హీరోలకి సంబంధించి ఏదైనా చిన్న ఇష్యూ బయటపడితే ఎంతో మంది హీరోలు, ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ ఇస్తుంది.

 కానీ అప్పట్లో సుమన్ జైలుకు వెళ్తే ఎవరూ కూడా ముందుకు వచ్చి ఆయనకి జరిగిన అన్యాయం గురించి నోరు విప్పలేదట. కేవలం సుహాసిని, సుమలత ఇద్దరు హీరోయిన్లు మాత్రమే సుమన్ అలాంటివాడు కాదని, ఆయన నిర్దోషి అని,ఆయనకు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదని,ధైర్యంగా ఉండమని మీడియా ముందుకు వచ్చి తెలిపారు. ఈ ఇద్దరు హీరోయిన్లు మాత్రమే నేను జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. అలాగే నా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ కూడా నాకు అండగా నిలిచారు. నేను జైలుకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా బయటికి వచ్చి నోరు విప్పలేదు. బహుశా వాళ్ళందరూ భయపడ్డారేమో తెలియదు.ఇక నేను జైలు నుండి బయటకు వచ్చాక మోహన్ బాబు గారు నా ఇంటికి వచ్చి పెద్ద దండ నా మెడలో వేసి ఆ సాయిబాబా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పుకొచ్చారు అంటూ సుమన్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: