దీనికి కారణం ఏమిటంటే... తన విపరీతమైన అందమే అని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ! "నా అందమే నాకు శాపమైంది. నేను కొన్ని అర్థవంతమైన కథలు, మంచి పాత్రలు చేయాలని కోరుకున్నాను. కానీ చాలా మంది దర్శకులు నన్ను చూసి ... 'ఆ పాత్రకు నువ్వు చాలా అందంగా ఉన్నావు, అంత అందమైన అమ్మాయి సినిమా సెట్‌కు కరెక్ట్‌గా సరిపోదు' అని తిరస్కరించారు!" అంటూ ఆమె చెప్పిన మాటలు సినీ పరిశ్రమలోని మరో చీకటి కోణాన్ని బయటపెట్టాయి. 'మెయిన్ స్ట్రీమ్' ముద్ర: టాలెంట్‌కు అడ్డుకట్ట.. దర్శకులు ఆమెను కేవలం 'మెయిన్ స్ట్రీమ్ గ్లామరస్ నటిగా' మాత్రమే చూశారు తప్ప, మంచి కథతో కూడిన చిత్రాలకు పనికిరాదని భావించారు.
ఇక తన విపరీతమైన అందం కారణంగానే ఎన్నో అద్భుతమైన, టాలెంట్‌కు అవకాశం ఇచ్చే చిత్రాల్లో నటించే అవకాశాలు కోల్పోయానని దియా మీర్జా ఎమోషనల్ అయ్యింది. ఈ కామెంట్స్ విన్న నెటిజన్లు... సినిమా ప్రపంచంలో టాలెంట్ ఉన్నప్పటికీ, అందం ఒక హద్దుగా మారడం ఎంతటి విచిత్రమో అని చర్చించుకుంటున్నారు . స్టార్ హీరోయిన్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటే ... టాలెంట్ ఉన్నా సరైన అవకాశాల కోసం ఎదురుచూసే కొత్త నటీమణుల పరిస్థితి ఏంటో అర్థమవుతోంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి