మా ప్రార్థన ఫలించింది!
కియారా అద్వానీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో... అదృష్ట దేవత తమ ఇంటికి వచ్చినంత మధురంగా ఉంది. తమ బుజ్జాయి చిన్ని పాదాలను ప్రేమగా తమ చేతుల్లో పట్టుకుని ఉన్న ఆ ఫోటో చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చకమానవు. "మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చింది" అంటూ కియారా రాసిన ఎమోషనల్ క్యాప్షన్ లక్షల మంది హృదయాలను తాకింది.ఇక ఇదే పోస్ట్‌లో, ఈ స్టార్ హీరోయిన్ తమ కూతురి పేరును కూడా రివీల్ చేసింది. ఆ చిట్టితల్లి పేరు... 'సరాయా మల్హోత్రా' (Saraya Malhotra)! ఈ మధురమైన పేరు ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యింది. సరాయా అంటే 'విలువైన' లేదా 'అత్యంత సుందరమైన' అనే అర్థం వచ్చే అరుదైన పదం. తమ ముద్దుల కూతురిని ఈ ప్రపంచానికి అత్యంత ప్రత్యేకంగా, వినూత్నంగా పరిచయం చేసిన తీరుకు అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు!
గ్లామర్ మమ్మీ.. లక్కీ డాడీ!
తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కియారా... 'వార్ 2' వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అటు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా బాలీవుడ్‌లో వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితంలో ఇంతటి ఆనందాన్ని పంచుకోవడం చూస్తుంటే, వారిపై అభిమానం మరింత పెరుగుతోంది.సరాయా మల్హోత్రా రాకతో ఈ స్టార్ కపుల్ జీవితంలో మరింత కాంతి నిండిపోయింది. ఈ అద్భుతమైన ఫోటో మూమెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ సునామీ సృష్టిస్తూ... అందరి నుంచి ఆశీస్సులు అందుకుంటోంది. చిట్టితల్లి సరాయాకు ఘన స్వాగతం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి