శోభిత కేవలం తన గ్లామర్‌తోనే కాదు, వైవిధ్యమైన ప్రాజెక్టులతోనూ అదరగొడుతోంది. తెలుగులో అడివి శేష్‌తో కలిసి చేసిన 'గూఢచారి' సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ముఖ్యంగా, 'పొన్నియిన్ సెల్వన్' సిరీస్ తర్వాత శోభిత రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది.ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, కేవలం నటనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్లడమే శోభిత ప్లాన్. స్టార్ హీరోల సినిమాల్లో ఒక పక్కన మెరుస్తూనే, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి ప్లాన్ బిని పక్కాగా సిద్ధం చేసుకుంది. అందుకే, నార్త్ టూ సౌత్.. శోభిత ధూళిపాళ పేరు మారుమోగుతోంది. గ్లామర్, టాలెంట్ కలగలిపిన ఈ బ్యూటీ ఇప్పట్లో ఆగేలా లేదు. శోభిత ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి