తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి 2026 బాక్సాఫీస్ యుద్ధం మామూలుగా ఉండబోదు! ఈసారి బరిలోకి దిగుతున్న నాలుగు ప్రధాన చిత్రాలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌నే బలంగా టార్గెట్ చేశాయి. ఈ మహా సంగ్రామానికి ట్రైలర్‌గా నాలుగు సినిమాల నుంచి మొదటి పాటలు విడుదలయ్యాయి. మరి ఈ మ్యూజిక్ రేసులో ఏ పాట మాస్ ఆడియన్స్ గుండెలను కొల్లగొట్టి, పండగ బజ్‌ను పెంచిందో చూద్దాం!


'మీసాల పిల్ల'

పోటీలో అందరికంటే ముందుగా వచ్చి, రికార్డులు బద్దలు కొట్టిన పాట మెగా మూవీ నుంచి వచ్చిన 'మీసాల పిల్ల'. ఈ పాట పాన్ ఇండియా ఫ్లేవర్ లేకుండా, కేవలం ఒకే భాషలో విడుదలైనప్పటికీ.. ఏకంగా 70 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. ఈ పాటపై సోషల్ మీడియాలో లక్షల్లో రీల్స్, పోస్టులు పడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ ట్యూన్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. నిజానికి, ఈ పాట కనక ఇంతటి రీచ్ తెచ్చుకోకపోయి ఉంటే, బజ్ విషయంలో ఈ మెగా మూవీ ఖచ్చితంగా వెనుకబడి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు.



'రాజా సాబ్'

అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన మరో పాట.. 'రాజా సాబ్' టైటిల్ ట్రాక్! కానీ, ఈ పాట అభిమానుల నుంచే ఎక్స్‌ట్రార్డినరీ అనిపించుకోలేకపోయింది. తమన్ కంపోజింగ్‌పై కొందరి నుంచి కామెంట్లు రావడంతో.. ఈ మాస్ ట్రాక్ అంచనాలను అందుకోలేకపోయిందనే మాట వినిపిస్తోంది.

ఇక, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న సినిమా నుంచి విడుదలైన 'భీమవరం బల్మా' పాట కూడా ఇన్స్టాంట్‌గా ఎక్కకపోయినా.. మెల్లగా స్లో పాయిజన్ అవుతుందేమో చూడాలని టీమ్ భావిస్తోంది. మార్కెటింగ్ పరంగా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మాస్ మహారాజా డ్యూయెట్.. రెగ్యులర్ టచ్!

మరోవైపు, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం నుంచి వచ్చిన 'బెల్లా బెల్లా' డ్యూయెట్ పాట కొంచెం రెగ్యులర్ టచ్‌లోనే ఉంది. హీరోయిన్ ఆశికా రంగనాథ్ గ్లామర్ ఉన్నప్పటికీ.. ఈ పాట కూడా ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా, సంక్రాంతికి వస్తున్న ఈ నాలుగు పాటల్లో.. చప్పట్లు, రికార్డులు ఎక్కువ వచ్చింది మాత్రం 'మీసాల పిల్ల'కే! ఈ సాంగ్ ఇచ్చిన బజ్.. సంక్రాంతి బరిలో ఆ సినిమాకు భారీ అడ్వాంటేజ్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: