తెలుగు సినీ చరిత్రలో కొన్ని పోటీలు కేవలం కలెక్షన్స్ లెక్కలు కావు.. అవి సినీ అభిమానుల గుండెల్లో రేగిన టెన్షన్, ఫైర్! దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలిన ఇద్దరు అగ్రశ్రేణి హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరియు కింగ్ నాగార్జున (King Nagarjuna) మధ్య జరిగిన బాక్సాఫీస్ ‘యుద్ధం’ అలాంటిదే! వీరిద్దరూ సుమారు పదిసార్లకు పైగా ఒకే రోజు, లేదా ఒకే వారం గ్యాప్‌లో తమ చిత్రాలను విడుదల చేసి, బాక్సాఫీస్ వద్ద ‘యుద్ధ వాతావరణాన్ని’ సృష్టించారు!ఈ పోటీకి నాంది పలికింది నాగార్జున తొలి చిత్రంతోనే కావడం విశేషం. 1986లో కింగ్ నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్’, చిరంజీవి ‘వేట’తో పోటీ పడింది. తొలి చిత్రంతోనే నాగార్జున ‘విక్రమ్’ హిట్‌ను అందుకోగా, చిరంజీవి సినిమా నిరాశపరిచింది. దీంతో నాగ్, మెగాస్టార్‌కు తొలి షాక్ ఇచ్చారు. కానీ మెగాస్టార్ చిరంజీవి వెంటనే కౌంటర్ ఇచ్చారు. అదే ఏడాది వచ్చిన ‘చంటబ్బాయ్’ ఘన విజయం సాధించి, నాగార్జున ‘కెప్టెన్ నాగార్జున’ ఫ్లాప్‌ను మింగేసింది.


1989లో చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వంటి ఇండస్ట్రీ హిట్‌తో పోటీపడి నాగార్జున సినిమా వెనకబడింది. 90ల్లోనూ, 2000లలోనూ వీరి పోటీ కొనసాగింది. 2006లో వచ్చిన చిరంజీవి ‘స్టాలిన్’, నాగార్జున ‘బాస్’ చిత్రాలతో తలపడగా, ‘స్టాలిన్’ మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సమయంలో చిరంజీవి మాస్ హిట్‌లతో దాదాపు పదేపదే పై చేయి సాధించారు.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2022లో వీరిద్దరూ మళ్లీ దసరా బరిలో దిగారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మరియు నాగార్జున ‘ది ఘోస్ట్’ ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ సందర్భంలో కూడా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద తన స్టార్‌డమ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.



ఇలా, దాదాపు పదిసార్లకు పైగా జరిగిన ఈ బాక్సాఫీస్ ‘యుద్ధం’.. ఇద్దరు లెజెండరీ హీరోల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీని, వారి స్నేహాన్ని మరింత పెంచిందే తప్ప, తగ్గించలేదు. ఈ పోటీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కు అంతులేని కిక్ ఇవ్వడమే కాదు, టాలీవుడ్ స్థాయిని కూడా పెంచింది!

మరింత సమాచారం తెలుసుకోండి: