సాధారణంగా రాజమౌళి ఒక చిత్రాన్ని పూర్తి చేయడానికి 2–3 సంవత్సరాలు సమయం తీసుకుంటారు. అయితే, ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉందని నిర్మాత కె.ఎల్. నారాయణ వెల్లడించారు. ఆయన మాటల్లో—ఈసారి రాజమౌళి మరింత వేగంగా పనిచేస్తూ, అనుకున్న టైమ్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేసి 2027లో గ్రాండ్ వరల్డ్‌వైడ్ రీలీజ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. మొదటి భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత మహేష్ బాబు కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి విదేశీ వెకేషన్‌కు వెళ్లినట్టు సమాచారం. దీనివల్ల షూటింగ్ సహజంగానే బ్రేక్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
గతంలో మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ను ‘సీజ్’ చేశానని రాజమౌళి సరదాగా చెప్పిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. అయితే ఈసారి మహేష్ బాబు వెకేషన్‌ను ఆపలేకపోయారని, చివరకు జక్కన్న కూడా స్టార్ హీరో ఫ్యామిలీ టైమ్‌కి లొంగిపోయారని నెటిజన్లు హాస్యంగా కామెంట్స్ చేస్తున్నారు.‘వారణాసి’ చిత్ర కథ, స్కేలు, విజువల్ ట్రీట్మెంట్ అన్నీ రాజమౌళి మార్క్‌లోనే ఉంటాయని తెలిసింది. ప్రపంచ స్థాయి లొకేషన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మహేష్ బాబు లుక్. ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియెన్స్ ఈ సినిమాను అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ప్రస్తుతం హీరో వెకేషన్ ముగిసిన వెంటనే రెండో షెడ్యూల్ ప్లాన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద షూటింగ్ బ్రేక్ ఒక చిన్న గ్యాప్ తప్ప ఇంకేమీ కాదని, సినిమా 2027 లక్ష్యాన్ని చేరేలా టీమ్ ఫుల్ స్పీడ్‌లో పనిచేస్తోందని ఇండస్ట్రీ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి