రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లో నిర్వహించిన ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌ కోసం ప్రత్యేకంగా జపాన్‌ వెళ్లిన ప్రభాస్ అక్కడ అభిమానుల నుండి పొందిన అపారమైన ప్రేమను మరోసారి ప్రపంచానికి చూపించాడు. తన వ్యక్తిత్వంలో ఒక గ్లోబల్ స్టార్‌గా నిలుస్తున్న ప్రభాస్ ఈ టూర్ ద్వారా ఆశ్చర్యపరిచేంత క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటికే జపాన్‌లో ‘బాహుబలి’ సిరీస్‌కు ఉన్న ఆదరణ గురించి అనేక సందర్భాల్లో వినే ఉంటాం. అయితే ఈసారి అక్కడి అభిమానులు ప్రభాస్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు థియేటర్ల ముందే క్యాంపులు వేసిన విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈవెంట్‌కు ఆయన ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి అక్కడి హాళ్లలో పూర్తిగా సెలబ్రేషన్ మోడ్ నెలకొంది.


అయితే ఈ ఈవెంట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయమే ప్రభాస్ యొక్క కొత్త లుక్. చాలా రోజుల తర్వాత పూర్తిగా సన్నగా, లీన్‌గా కనిపించిన ప్రభాస్‌ను చూసి అభిమానులు షాక్ అయ్యేంతగా సంతోషిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన భారీ బల్కీ లుక్‌లోనే కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ కారణంగా ఆయన పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉన్నారు. ఆ సినిమా లుక్ బయటకు రాకుండా ఉండేందుకు మేకర్స్ కూడా ఆయన పబ్లిక్ అపియరెన్సులు కట్టడి చేశారు.


ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పూర్తిగా న్యూ లుక్‌లో కనిపించబోతున్నారని గతంలోనే కొంత సమాచారం వచ్చింది. ఇప్పుడు జపాన్ ఈవెంట్‌లో కనిపించిన ఈ లీన్ లుక్‌ నిజంగా ‘స్పిరిట్’ కోసం మార్చుకున్నదేనా? అనే ప్రశ్నపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. కొంతమంది ఫ్యాన్స్ ..“ఇదే స్పిరిట్ లుక్…! ఎంత సన్నగా, ఎంత ఎనర్జీగా కనిపిస్తున్నాడో చూడండి. ఇదే మా డార్లింగ్ అసలు లుక్!” అంటున్నారు.  ఇంకొందరు సరదాగా కామెంట్ చేస్తూ..“ఇలా కనిపిస్తుంటే మై సూర్ పాక్ లా కొరుక్కుని తినేయాలి అని ఉంది.. డార్లింగ్‌ని ఇంత అందంగా మళ్లీ చూడడం నిజంగా వేరే ఫీల్!” అంటున్నారు. ప్రభాస్ న్యూ లుక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: