టాలీవుడ్ లో ఉన్న దర్శకులలో పూరి జగన్నాథ్ కి ఒక మంచి గుర్తింపు ఉంది. ఈయనకి ఇప్పుడున్న ఎంతోమంది హీరోలను స్టార్ హీరోల్ని చేసిన క్రెడిట్ ఉంది. అలా రవితేజ,మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలని మాస్ హీరోలుగా మలిచింది పూరి జగన్నాధే. అయితే అలాంటి పూరి జగన్నాథ్ మొదటి సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాస్ హీరోగా మారడమే కాకుండా పూరి జగన్నాథ్ కి కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది.అయితే పూరి జగన్నాథ్ మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో కాదట మరో సూపర్ స్టార్ తో చేయాల్సి ఉందట.అంతేకాదు ఆ సినిమాకి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయట.కానీ మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది. 

మరి ఇంతకీ పూరి జగన్నాథ్ ఫస్ట్ ఏ హీరోని డైరెక్ట్ చేయాలి అనుకున్నారంటే సూపర్ స్టార్ కృష్ణ..అవును మీరు వినేది నిజమే.. సూపర్ స్టార్ కృష్ణతో పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉండేది. అలా కృష్ణతో థిల్లానా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని ప్లాన్ చేశారట పూరి జగన్నాథ్. ఈ సినిమా లో ఎలాంటి ఫైట్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీయాలి అనుకున్నారట. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కృష్ణ కూతురు మంజుల చేతుల మీదుగా జరిగింది.కానీ ఆదిలోనే ఈ సినిమాకి ఎండ్ కార్డ్ పడింది. అదెలా అంటే ఈ సినిమాని నిర్మించే నిర్మాత కృష్ణకి ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ ఉంది. ఆయనకి యాక్షన్ సినిమాలైతేనే పర్ఫెక్ట్..

 అలాంటి హీరోతో ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ఖచ్చితంగా సినిమాని ఎవరు చూడరు అని నిర్మాత వెనక్కి తగ్గారట.దాంతో కృష్ణతో తీయాల్సిన పూరీ జగన్నాథ్ ఫస్ట్ మూవీ ఆగిపోయింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు రామ్ జగన్ బయట పెట్టారు. అలాగే కృష్ణ తర్వాత జగపతిబాబుతో కూడా ఓ సినిమా ఫిక్స్ అయిందట.ఇక ఆ సినిమా ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అనే సమయంలో ఆగిపోయిందట.అలా పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా పరిచయం కావలసిన రెండు సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో చివరికి పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని బద్రి సినిమా స్టోరీ చెప్పారు. అలా పవన్ కళ్యాణ్ తో బద్రి తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: