ది రాజాసాబ్ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను  చూడబోతున్నామని ఫ్యాన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఉన్నారు.  ఇప్పటికే విడుదలైన అప్ డేట్స్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. బండి కొంచెం మెల్లగా అంటూ సరికొత్త డైలాగ్స్ తో  ప్రభాస్  ఈ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు. మారుతి గత సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా రాజాసాబ్ సినిమాతో ఈ డైరెక్టర్ జాతకం మారిపోవడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బిజినెస్ పరంగా కూడా రాజాసాబ్ సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.

సినిమా థియేట్రికల్ హక్కులే 600 నుంచి 700 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ సినిమా బిజినెస్ విషయంలో నిర్మాత విశ్వప్రసాద్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  బాలీవుడ్ లో సైతం ఊహించని స్థాయిలో మార్కెట్ ను కలిగి ఉన్న ప్రభాస్ ది  రాజాసాబ్ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ను కూడా షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ది  రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు  సృష్టిస్తుందో చూడాలి.

ది  రాజాసాబ్ తర్వాత సంక్రాంతి రేసులో నిలిచిన పెద్ద సినిమా  ఏదనే  ప్రశ్నకు  చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా పేరు జవాబుగా వినిపిస్తోంది. ఈ సినిమాను జనవరి 12వ తేదీన  విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.  జనవరి 12వ తేదీన విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద  సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో  మేకర్స్ ఈ డేట్ పై  దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అటు చిరంజీవి మార్క్ ఇటు అనిల్ రావిపూడి మార్క్ మిస్ కాకుండా  ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో  గారపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండగా విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ 10 రోజుల డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారంటీ  అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: