రకరకాల వధంతులు చర్చలు సోషల్ మీడియాను షేక్ చేసిన తరువాత ఆ వదంతులకు చెక్ పెడుతూ ఎట్టకేలకు నందమూరి అభిమానులు కోరుకున్న విధంగా ‘అఖండ 2’ ధియేటర్లలో ఈవారం శివతాండవం చేయబోతోంది. ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్లు డిసెంబర్ 11 అర్థరాత్రి నుండి మొదలుకాబోతున్నాయి కాబట్టి ఈమూవీకి వచ్చే అర్థరాత్రి టాక్ బట్టి ఈమూవీ బయ్యర్ల భవిష్యత్ తెలియబోతోంది.


బాలకృష్ణ కెరియర్ లో ఏమూవీకి జరగనంత అత్యంత బిజినెస్ ఈమూవీకి జరగడంతో ఎంతవరకు బాలయ్య స్టామినా బయ్యర్లకు కోట్ల వర్షం కురిపించగలదు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీ బయ్యర్లు లాభాల బాట పట్టాలి అంటే కనీసం ఈమూవీ ధియేటర్లు వారంరోజులు అయినా కళకళలాడాలి. అయితే టాప్ హీరోల సినిమాలు కూడ మొదటి మూడు రోజులు గడచిన తరువాత ధియేటర్లు కలక్షన్స్ లేక సతమతమవుతున్నాయి.


అయితే ఈసినిమాకు ‘అవతార్ 3’ పోటీ చాల గట్టిగా ఉండబోతోంది. ప్రపంచం యావత్తు ఎదురు చూస్తున్న ‘అవతార్ 3’ డిసెంబర్ 19న విడుదలకాబోతోంది. ఈసినిమాను చూడటానికి ఆశక్తి కనపరుస్తూ బుక్ మై షోలో 1.2 మిలియన్స్ ఆశక్తి కనపరుస్తున్నారు అంటే ఈసినిమా మ్యానియా ఏరేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. 3,500ల కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ ఒక విజువల్ వండర్. ఇలాంటి మ్యానియాను తట్టుకుని ‘అఖండ 2’ నిలబడాలి అంటే ‘అఖండ 2’ కు పాజిటివ్ టాక్ వచ్చితీరాలి.


దీనికితోడు ఈసినిమా రెండవ వారంలోకి ఎంటర్ అయ్యే సమయానికి ‘అఖండ 2’ కు ధియేటర్ల సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. బోయపాటి బాలయ్యల కాంబినేషన్ పై క్రేజ్ ఉన్నప్పటికీ జేమ్స్ క్యామరూన్ మ్యానియాను తట్టుకుని ఎంతవరకు ‘అఖండ 2’ నిలబడగలుగుతుంది అన్న సందేహాలు చాలామంది కలుగుతున్నాయి. అయితే ‘అఖండ 2’ కొన్ని కారణాలు వల్ల క్రితం వారం విడుదల అవ్వకపోవడంతో ఈమూవీ పై ఆశక్తి బాగా పెరిగింది. దీనితో ‘అవతార్’ మ్యానియాకు ఎదురు నిలబడి బాలయ్య విజయాన్ని సాధిస్తే అది ఒక సంచలనం..  


మరింత సమాచారం తెలుసుకోండి: