టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే 2019 వ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అలా 2019 వ సంవత్సరం విడుదల అయిన సినిమాలు ఏవి ..? అలా విడుదల అయిన సినిమాల్లో ఏ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని సినిమాల కంటే ముందు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కథానాయకుడు సినిమా జనవరి 9 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే భారీ నెగటివ్ బాక్సా ఫీస్ దగ్గర వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత రోజు అనగా జనవరి 10 వ తేదీన రజనీ కాంత్ హీరో గా రూపొందిన తమిళ్ డబ్బింగ్ సినిమా అయినటువంటి పేట విడుదల అయింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. ఇక ఆ తర్వాత రోజు అయినటువంటి జనవరి 11 వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విజయ రామ సినిమా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత రోజు అయినటువంటి జనవరి 12 వ తేదీన విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ మూవీ విడుదల అయింది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి 2019 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: