సహజత్వానికి దగ్గరగా ఉండటం, తరుణ్ భాస్కర్, అభినవ్, కామెడీ.సహజత్వానికి దగ్గరగా ఉండటం, తరుణ్ భాస్కర్, అభినవ్, కామెడీ.ప్రొడక్షన్ వాల్యూస్, మాస్ ఎలిమినెట్స్ మిస్సింగ్
టివి ఛానెల్ లో యాంకర్ గా పనిచేసే రాకేష్ (తరుణ్ భాస్కర్) డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్)ను ప్రేమిస్తాడు. ఆమెకు సిగరెట్, మందు తాగడం లాంటివి అసలు అలవాటు లేదని అబద్ధాలు చెబుతాడు. అయితే స్టెఫీతో పెళ్లి ఫిక్స్ చేసుకుని రెండు రోజుల్లో పెళ్లనగా ఒక అమ్మాయితో రాకేష్ గదిలో ఉన్న వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియో చూసి తన స్నేహితుడు అభినవ్ హెల్ప్ తో ఆ వీడియోని సైడ్ నుండి డిలీట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? ఆ వీడియో స్టేఫీకి కనిపించిందా..? స్టెఫీకి ఆ వీడియో గురించి నిజం తెలిసిందా..? అన్నది సినిమాలో చూడాల్సిందే. 



రాకేష్ పాత్రలో తరుణ్ భాస్కర్ అదరగొట్టారు. దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా తరుణ్ భాస్కర్ ది బెస్ట్ అనిపించుకున్నారు. తన డైలాగ్ డెలివెరీ, కామెడీ సెన్స్ బాగుంది. ఇక అభినవ్ గోమటం కూడా ఈ సినిమాలో మెప్పించాడు. సినిమాలో ఫీమేల్ లీడ్ గా చేసిన వాణి కూడా అలరించింది. అనసూయ కూడా తన పాత్రలో మెప్పించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.  



మాధన్ గుణదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ బాగున్నా ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేకపోవడం వల్ల అంత గొప్పగా అనిపించలేదు. శివ కుమార్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. బిజిఎం కూడా ఆకట్టుకుంది. షమీర్ సుల్తా కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగినట్టుగా ఉన్నా ఇంకాస్త ఖర్చు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది.



న్యూ టాలెంటెడ్ పీపుల్స్ వస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. చిన్న బడ్జెట్ లో పర్ఫెక్ట్ కంటేంట్ తో సినిమా తీస్తే పక్కా హిట్ అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇక అలాంటి కోవలో వచ్చిన సినిమానే మీకు మాత్రమే చెప్తా. షమ్మీర్ సుల్తాన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండే కథ, కథనాలతో వచ్చింది.  


సినిమాలో రాకేష్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటన మెప్పించింది. దర్శకుడు రాసుకున్న కథ దానికి తగినట్టుగా కాస్టింగ్ ఎంచుకున్నాడు. కథనం కూడా ఎంటర్టైనింగ్ గా సాగించాడు. సినిమా అంతా సరదాగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ దర్శకుడు పట్టు తప్పినట్టు అనిపించినా మళ్లీ సెట్ రైట్ చేసుకున్నాడు. 


తరుణ్ భాస్కర్ హీరో అనగానే ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి సరదాగా వెళ్లి నవ్వుకుని వచ్చే సినిమా మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగింది. అక్కడక్కడ కొంత ల్యాగ్ అయినట్టు అనిపించినా ఫైనల్ గా ఫ్యామిలీ, యూత్ అందరిని అలరించేలా సినిమా ఉంది.


తరుణ్ భాస్కర్, యాంకర్ అనసూయ, విజయ్ దేవరకొండమీకు మాత్రమే చెప్తా.. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్

మరింత సమాచారం తెలుసుకోండి: