విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన f3 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేశారు. f2 సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబో మోర్ ఫన్ తో వచ్చిన f3 ఆశించిన స్థాయిలో ఉందా లేదా అన్నది ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వెంకీ (వెంకటేష్) అడ్డదారుల్లో అయినా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఇక వరుణ్ (వరుణ్ తేజ్) కూడా గొప్ప గొప్ప కలలు కంటాడు కానీ అతని కలలు నెరవేర్చుకోవడానికి డబ్బులు ఉండవు. ఈ క్రమంలో డబ్బున్న కుటుంబంలోని అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని హనీ (మెహ్రీన్) ని ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హనీ కూడా అలానే డబ్బున్న కుర్రాడిని పెళ్లి చేసుకుని కష్టాల నుండి గట్టెక్కాలని అనుకుంటుంది. ఇలా అందరు తమ సమస్యల్లో మునిగిపోయిన టైం లో బిజినెస్ మెన్ ఆనంద్ ప్రసాద్ (మురళి శర్మ) గురించి వీళ్లకు తెలుస్తుంది.  తనకు దూరమైన వారసుడి కోసం వెతికే ఆనంద్ ప్రసాద్ కి ఆ వారసుడు తానే అని ప్రూవ్ చేసుకోవడానికి అందరు వస్తారు. ఇంతకీ ఆనంద్ ప్రసాద్ వారసుడిగా ఎవరిని స్వీకరిస్తాడు. వీరంగా వారి సమస్యల నుండి ఎలా బయట పడ్డారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

F2 తో ఆడియెన్స్ కి ఎంటర్టైనింగ్ అందించిన అనీల్ రావిపుడి అదే పంథాలో f3 అంటూ మరో మూవీతో వచ్చాడు. ఇందులో యూనివర్సల్ ప్రాబ్లెం డబ్బు గురించి ప్రస్థావిస్తూ పాత్రలని చక్కగా వాడుకున్నాడు డైరక్టర్ అనీల్ రావిపుడి. సినిమా అంతా వారి సమస్యల నుండి బయట పడేందుకు డబ్బుని పొందాలనే ఆశయంతోనే నడుస్తుంది.

కథ అంత గొప్పగా లేకపోయినా కథనం ప్రేక్షకులను మెప్పించేలా చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా సరదాగా చూసేలా f3 ఉందని చెప్పొచ్చు. వెంకటేష్ రేచీకటి, వరుణ్ తేజ్ నత్తి లాంటివి సినిమాకు మరింత ఫన్ యాడ్ అయ్యేలా చేశాయి. ఇక సునీల్, ఆలిల కామెడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

అయితే లాజిక్ ఆలోచించి సినిమా చూస్తే మాత్రం నిరాశ కలుగుతుంది. ఎలాంటి లాజిక్స్ లేకుండా జస్ట్ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి f3 మంచి ఎంటర్టైనింగ్ అందిస్తుంది. సినిమా చూస్తున్నంత టైం లో ఈవీవీ సినిమా గుర్తుకు రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి తో వచ్చే ఎపిసోడ్ మాత్రం అందరి ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

సినిమా అంతా కూడా కొత్తగా ఏమి అనిపించకపోయినా అనీల్ రావిపుడి రాసుకున్న కథనం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఫైట్ సీన్ కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. f3 ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించడంలో మంచి మార్కులు కొట్టేసిందని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

వెంకటేష్ ఎప్పటిలానే తన ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఆయనకు తోడుగా వరుణ్ తేజ్ కూడా అదరగొట్టాడు. తెలంగాణ యాసలో వరుణ్ తేజ్ కామెడీ బాగుంది. సునీల్ మళ్లీ తన పాత పంచుల పంథా కొనసాగించాడు. ఒకప్పటి సునీల్ ని ఈ సినిమాలో చూడొచ్చు. అలికి కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక సినిమాలో హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ అలరించారు. పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. మురళి శర్మ, రవి బాబు మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనర్ గా f3 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఆ విషయంలో అనీల్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దిల్ రాజు ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్

వరుణ్ తేజ్

ఎంటర్టైనింగ్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

మిస్సింగ్ లాజిక్

బాటం లైన్ :

F3 ప్రేక్షకులకు నవ్వుల పండుగే..!

రేటింగ్ : 3/5


మరింత సమాచారం తెలుసుకోండి: