అక్కినేని వంశంలోని మూడు తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఇష్క్ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 12 నుంచి ఈ చిత్రం షూటింగ్ లాంచనంగా ప్రారంభం అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాదిలో జరుగుతుంది.
కాగా, ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా సమంత ఎన్నిక అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సమంత నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ తాజా సమాచారం. నాగ చైతన్య, సమంత తొలిసారిగా ఏం మాయ చేశావే సినిమాలో కలసి నటించారు. ప్రస్తుతం ఆటోనగర్ సూర్య చిత్రంలో కలసి నటిస్తున్నారు. ఇప్పడు అక్కినేని వంశంలోని ముగ్గురు కథానాయకులు కలిసి నటించే సినిమాలో కూడా సమంత నటించినున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి