తన అభినయంతో సిని అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి సావిత్రి. అయితే సావిత్ర తన మొదటి సినిమా ఛాన్సును భయంతో కాలదన్నుకున్నది.
వివరాల్లోకి వెళ్లితే... అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన సంసారం (1950)లో హీరోయిన్ గా మొదటగా సావిత్రినే ఎన్నుకున్నారు. అయితే అక్కినేని అంతటి హీరో పక్కన నటించడానికి సావిత్రి భయపడేది. ఒక రోజు షూటింగ్ లో అక్కినేని మీద మీదకు పోతూ సావిత్రి ఆటపట్టించే సీన్ చిత్రీకరించాడానికి ప్లాన్ చేశారు. అయితే అక్కినేని చూసి అసలే భయపడుతున్న సావిత్రి ఆ సీన్ లో నటించడానికి ఇంకా భయపడింది. అక్కినేనితో ఆ సీన్ చేయడం తన వల్ల కాదంటూ ఏడవ్వడం మొదలు పెట్టింది. దీంతో సావిత్రితో లాభం లేదనకుని ఆమె స్థానంలో పుష్పలతను ఎనుకున్నారు. అలా తన మొదటి ఆవకాశాన్ని సావిత్రి జారవిడుచుకుంది.
కాగా, ఆ తరువాత సావిత్రి, అక్కినేని జంటగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రావడం, ఇద్దరూ హిట్ పెయిర్ గా నిలవడం కాలం చేసిన మ్యాజిక్.
మరింత సమాచారం తెలుసుకోండి: