
పేదలకు అండగా ఉంటూ వారికి చేయూతనందించేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని టీడీపీ కువైట్ కోశాధికారి నాగినేని రమేష్‌నాయుడు అన్నారు. చిన్నవోరంపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్‌నాయుడు మాట్లాడుతూ కువైట్‌లో ఎవరైన మరణిస్తే, వారి మృతదేహాలను భారత్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. చెన్నై, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి వారి స్వగ్రామాలకు పంపించేందుకు ఉచితంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అపరాజిత మాట్లాడుతూ టీడీపీ కువైత్ సంఘం పేదల కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం, గ్రామపెద్దలు ఎన్.కృష్ణయ్యనాయుడు, కె.నరేష్‌నాయుడు, శ్రీనివాసులనాయుడు, తొండాపు ఈశ్వరయ్య నాయుడు, ఎం సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.