నిన్న మొన్నటి వరకూ అమెరికాను వణికించిన డోరియన్ తుపాన్ ఇప్పుడు కెనడాపై తన ప్రతాపం చూపుతోంది. డోరియన్ తుపాను కెనడాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే బహమాస్ దీవులు, ఉత్తర కరోలినాలను ఈ తుపాన్ తీవ్రంగా నష్టపరిచింది.


ఇప్పుడు కెనడాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం ఈ తుపాను ఉత్తర అట్లాంటిక్ వైపు సాగుతోందని తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. బలమైన గాలులతో కెనడా జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు.


డోరియన్ ధాటికి చెట్లు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి.ఇటీవలే ఈ డోరియన్ తుపాను అమెరికాలో బీభత్సం సృష్టించింది. 40 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతైనట్టు సమాచారం. వరదల ధాటికి వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి.


కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు చీకటిలోనే గడపాల్సి వచ్చింది. బహమాస్ దీవులపైనా డోరియన‌ ప్రభావం చూపింది. ఇప్పటివరకు బహమాస్‌ దీవులపై విరుచుకుపడిన అతి పెద్ద తుఫాను ఇదేనని వాతావరణ శాఖ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: