రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. పసికూన లాంటి ఉక్రెయిన్ పై అగ్రదేశం గా కొనసాగుతున్న రష్యా బీకర రీతిలో దాడులకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.  కేవలం సైనిక స్థావరాలు మాత్రమే కాకుండా అటు జనావాసాలపై కూడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది సాధారణ పౌరులు సైతం ప్రస్తుతం ప్రస్తుతం రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.



 ఇలా రష్యా సైనికుల దాష్టీకానికి రోజు రోజుకి ఉక్రెయిన్ లో చనిపోతున్న సాధారణ పౌరుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏకంగా 14 వందల మందికి పైగా సాధారణ పౌరులు మృతి చెందారు అని అధికారులు అంచనా వేశారు. రష్యన్ సేనల కర్కశత్వానికి అభం శుభం తెలియని 117 మంది చిన్నారులు కూడా ఇప్పుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు వందలాది ఉక్రెయిన్ లో ఉన్న కుటుంబాలను దుఃఖ విలువ అంటూ ఉక్రెయిన్ పార్లమెంటు పేర్కొనడం గమనార్హం. అయితే ఏకంగా ప్రజలు తలదాచుకున్న ప్రాంతాలను గురిచూసి మరీ బాంబుల వర్షం కురిపిస్తుంది రష్యా సైన్యం.


 గతవారం ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ లో సురక్షిత ప్రాంతంలో తలదాచుకునేందుకు సిద్ధమైన ప్రజలందరూ కూడా మృత్యుఒడిలోకి చేర్చేందుకు బాంబు దాడికి పాల్పడింది రష్యా. అంతేకాదు ఇక ప్రజలందరూ తలదాచుకున్న బంకర్లనే టార్గెట్గా చేసుకుని రష్యా దాడులకు దిగుతూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల ఏకంగా సూపర్ సోనిక్ మిస్సైల్ తో దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది రష్యా అన్నది తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి మాత్రం విఫలం అవుతూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: