ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య ఎంత తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలోనే రష్యన్ సేనల భీకర దాడులకు ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలి.  రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఇక ప్రపంచ దేశాలు కూడా ఆందోళనలో మునిగిపోతున్నాయి. ఉక్రెయిన్లో సైనికులతో పాటు అటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉండడం గమనార్హం. ఎంతో మంది సాధారణ పౌరులు ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లినప్పటికీ ఇలా ప్రజలు తలదాచుకుంటున్న ప్రాంతాలనే టార్గెట్గా చేసుకుంటూ మిస్సైల్ దాడులకు పాల్పడుతూ ఉంది రష్యా.


 దీంతో ఏ క్షణంలో ఎటు వైపు నుంచి బాంబు దూసుకు వచ్చి ప్రాణాలు తీస్తుందో అని అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో అటు అమెరికా రహస్యంగా ఆయుధాలను అందిస్తుంది అన్న ప్రచారం కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అటు రష్యా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక దౌత్యపరమైన సంబంధాలు అన్నింటిని కూడా తెంచుతుంది అమెరికా. అయితే అమెరికా ఎన్ని ఆంక్షలు విధించిన రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిహద్దులకు సమీపంలో కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జో బైడెన్ ఐరోపా పర్యటనలో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలాండ్లో ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజెస్టో నగరంలో పర్యటించారు జో బైడెన్.  ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్య కొనసాగుతున్న వేల ఇక ఆ దేశ సరిహద్దు వరకు చేరువగా జో బైడెన్ పర్యటించడం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అక్కడ మోహరించిన అమెరికన్ బలగాలతో జో బైడెన్ మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. దీంతో పాటు ఇక శరణార్థులు అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్జీవోలతో కూడా జో బైడెన్ బేటి నిర్వహించబోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: