నక్క జిత్తుల మారి చైనా ఎప్పుడూ ఇతర దేశాలకు సంబంధించిన భూభాగాలను ఆక్రమించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇందులో భాగంగానే గతంలో భారత్ చైనా సరిహద్దుల్లో నిషేధిత భూభాగంలోకి గుడారాలు ఏర్పాటు చేసుకుని ఆక్రమణకు పాల్పడింది.  కాని భారత సైన్యం ఎంతో దీటైన సమాధానం చెప్పడంతో చివరికి చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ క్రమంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అనే విధంగా ఉండిపోయింది పరిస్థితి.


 ఇక ఇప్పుడు పొరుగున ఉన్న చిన్న దేశం అయిన తైవాన్ ను కూడా తమ దేశంలో కలుపుకోవాలి  అనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇక ఎన్నో రోజుల నుంచి వన్ చైనా  పాలసీ అంటూ తైవాన్ ను రెచ్చగొడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తైవాన్ గగనతలంలో కి యుద్ధ విమానాలను పంపించడం లాంటివి చేసిన చైనా.. ఇప్పుడు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని ఆయుధాలను మోహరించడం చేసింది. తద్వారా ఏ క్షణంలో చైనా తైవాన్ పై యుద్ధానికి దిగుతుందా అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలి.


 అయితే తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అమెరికా అటు చైనాను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా మాత్రం వెనకడుగు వేయలేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఒకవేళ చైనా యుద్దానికి దిగితే ఇక అమెరికా ప్రత్యక్ష యుద్ధం లో పాల్గొంటుందా లేదా అనే విషయంపై చర్చ జరిగింది.  ఈ విషయంపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఉక్రెయిన్ కి సహాయం చేస్తూ పరోక్ష యుద్ధం లో పాల్గొన్నట్లుగా కాకుండా ఒకవేళ చైనా యుద్ధం చేస్తే అమెరికా కాపడుతుందా అంటూ ప్రశ్నించగా తప్పకుండా కాపాడుకుంటుంది అంటూ సమాధానం చెప్పాడు జో్ బైడెన్. దీన్నిబట్టి అమెరికా ప్రత్యక్షయుద్ధంలోకి దిగే అవకాశం ఉంది అన్న ప్రచారం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: