ఇటీవల కాలంలో డబ్బులు సంపాదించాలని ఎంతోమంది వ్యక్తులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా కోటి రూపాయలు సంపాదించాలి అంటే మాత్రం ఎన్నో సంవత్సరాలు సమయం పడుతుంది అని చెప్పాలి. కానీ ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోవడం అంటే అది కేవలం కలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.


 లాటరీ కొనుగోలు చేయడం ద్వారా అదృష్ట లక్ష్మి గురించి చివరికి రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా మారిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి వార్తలు చూసినవారు లాటరీ టికెట్లను కొనుగోలు చేయడమే పనిగా పెట్టుకుంటూ అదృష్ట లక్ష్మి ఎప్పుడు వరిస్తుందా అని వేచి చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక వ్యక్తి భార్య చెప్పిన మాట విని చివరికి కోటీశ్వరుడు గా మారిపోయాడు. భార్య చెప్పినట్లుగానే పచారీ సామాన్లు కొనుగోలు చేసేందుకు షాప్ కి వెళ్లిన వ్యక్తికి రాత్రికి రాత్రి అదృష్టం వరించింది.


 దీంతో కోటీశ్వరుడు గా మారిపోయాడు. అంతేకాదు భార్య కారణంగానే నాకు ఈ అదృష్టం వచ్చింది అంటూ సంబరపడిపోతున్నాడు.. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం మర్కెట్ నగరానికి చెందిన ఫ్రెష్టన్ మాకి  ఇటీవల ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా భార్య నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకురావాలి అంటూ భార్య లిస్టు పంపింది. దారిలో ఉన్న ఒక సూపర్ మార్కెట్లో భార్య చెప్పిన సరుకులు కొన్నాడు సదరు వ్యక్తి.. అతని కన్ను ఫ్రెష్టన్ లాటరీ పై పడింది  ఆఫర్ రెండు లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఉంది. ఈ లాటరీ ఒకసారి కొనుగోలు చేశాడు. తర్వాత లాటరీ చెక్ చేసుకుని ఒకసారి ఆశ్చర్యపోయాడు. అతడికి లాటరీ నెంబర్ ఏకంగా 1,90, 736 డాలర్లు గెల్చుకుంది. భారత కరెన్సీలో అక్షరాలు 15 కోట్ల రూపాయలు  దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: