సాధారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆశ పడటం అందరి హక్కు. కానీ ఈ రికార్డు సాధించడం మాత్రం కొంతమందికే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ రికార్డును సాధించడం అంటే మనలో ఏదో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మంది ప్రజలు చేయలేని పని మనం చేసినప్పుడు ఇక ప్రపంచ రికార్డులో మన పేరు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఒకప్పుడు అసాధ్యమైన విన్యాసాలు చేసి ఎంతోమంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడం లాంటివి చూశాము. కానీ ఇటీవల కాలంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేసే పనులనే కాస్త కొత్తగా ఎవరికి సాధ్యం కాని రీతిలో చేసి గిన్నిస్ బుక్ రికార్డులు కొడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి ఏకంగా మద్యం తాగడం విషయంలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఏకంగా కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు అని చెప్పాలి.


 అదేంటి కూల్ డ్రింక్ తాగితే గిన్నిస్ బుక్ లో చోటు దక్కుతుందా.. అలా అయితే ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు కూల్ డ్రింక్ తాగాము. అయితే మాకు కూడా వరల్డ్ రికార్డు సొంతమవుతుందా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ అసలు విషయం తెలిస్తే మాత్రం అతనిలా కూల్ డ్రింక్ తాగడం కూడా మన వల్ల కాదు అని అర్థమవుతుంది. సాధారణంగానే ఒక గ్లాస్ థమ్సప్ తాగాలంటేనే కొంత సమయం తీసుకుంటారు అందరూ. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కొన్ని సెకండ్లలో రెండు లీటర్ల కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. యూఎస్ కు చెందిన ఎరిక్ అనే వ్యక్తి అత్యంత వేగంగా రెండు లీటర్ల కూల్ డ్రింక్ తాగి వరల్డ్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: