ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచం అనుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ విషయం తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది గిన్నిస్ బుక్ రికార్డులు సృష్టించేందుకు చేస్తున్న పనులు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి.


 సాధారణంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించాలి అంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఒకప్పుడు గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించడానికి ఎంతో మంది కఠినమైన పనులను ఏళ్ల తరబడి చేసేవారు. కానీ ఇటీవల కాలంలో రోజు చేసే పనులను ఎవరికి సాధ్యం కాని రీతిలో చేస్తే సరిపోతుంది గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవచ్చు అని కొంతమంది నిరూపిస్తున్నారు. ఇక్కడ ఒక యువకుడు అయితే ఏకంగా స్కాలర్షిప్ తో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.


 అదేంటి స్కాలర్షిప్ తీసుకోవడం వల్ల కూడా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అసలు విషయం తెలిస్తే మీరే గిన్నిస్ బుక్ రికార్డు తీసుకెళ్లి అతని చేతిలో పెట్టాలి అనుకుంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే... అమెరికాలోని లూసియానాకు చెందిన పదహారేళ్ళ డెన్నిస్ బార్న్స్ అనే కుర్రాడు ఒక అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 170 కి పైగా కాలేజీల్లో అడ్మిషన్కు ఎంపికయ్యాడు. అంతేకాదు సంబంధిత విద్యాసంస్థల నుంచి 73.6 కోట్ల స్కాలర్షిప్ ఆఫర్ అతనికి వచ్చింది. అయితే ఈ స్థాయిలో ఆఫర్లు వస్తాయి అని ఊహించలేదు అంటూ సదరు కుర్రాడు చెబుతున్నాడు. అయితే ఇది ప్రపంచ రికార్డ్ అని.. దీనిపై గిన్నిస్ బుక్ రికార్డ్ వారిని సంప్రదిస్తామని అతను చదివిన స్కూల్ యాజమాన్యం చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri