పాకిస్తాన్ లో ఇప్పుడు ఏర్పడిన పరిస్థితుల వెనుక అక్కడ ఏర్పడిన ఘర్షణ కారణం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘర్షణ కూడా వివిధ రాజకీయాల్లోని వివిధ వర్గాల మధ్య నడుస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పాకిస్తాన్ లోని సైన్యంలోనూ ఘర్షణ వచ్చింది. అధికార పక్షానికి, విపక్షానికి మధ్య కూడా ఘర్షణ వచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న వర్గాలన్నీ రెండుగా చీలిపోతున్నట్లుగా తెలుస్తుంది.


అక్కడ సైన్యము రెండుగా చీలిపోయింది. న్యాయ వ్యవస్థ రెండుగా చీలిపోయింది. ఇంకా ఐఎస్ఐ కూడ రెండుగా చీలిపోయిందని తెలుస్తుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ ముక్కలు అయినట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా రెండు ముక్కలు అవుతుందేమో అన్న పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఎందుకంటే సైన్యం గాని, అక్కడ ప్రభుత్వంలోని మిగిలిన పార్టీలకు సంబంధించిన నాయకులు గానీ కొంతమంది శాభా షరీఫ్ పక్కన ఉంటే మరి కొంతమంది ఇమ్రాన్ ఖాన్ తరపున ఉన్నట్లుగా తెలుస్తుంది.


కైబర్ ఫక్తూనా, కిల్కి పల్టిస్తాను వంటి ప్రాంతాల్ని కలుపుతూ ఒకవేళ ఇమ్రాన్ ఖాన్  దేశాన్ని విభజిస్తాడా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే షాబా షరీఫ్ కూడా అక్కడ దేశాన్ని విభజించే లెక్కలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటున్నారు. అసలు పాకిస్తాన్ సైన్యం అక్కడ ప్రభుత్వంలో ఎంత పాత్ర పోషిస్తుందో మనకు తెలిసిందే. అలాంటి పాకిస్తాన్ సైన్యం రెండుగా చీలిపోయిందని ఇప్పటివరకు ఖచ్చితంగా అఫీషియల్ గా తెలియలేదు.


కానీ ఇప్పుడు అమెరికా నోటి వెంట ఈ మాట వచ్చిందని తెలుస్తుంది. జల్ మే కైల్ జాత్ అని అమెరికా రాయబారి చెప్తున్నది ఏమిటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కింద ఉన్నటువంటి సైనిక ఉన్నత అధికారులు ఇద్దరు ఎదురు తిరిగారని ఆయన అంటున్నాడు. వాళ్ళిద్దర్నీ మీటింగ్ కి రమ్మని పిలిస్తే వాళ్ళు రాలేదని తెలుస్తుంది. ఈ గొడవలన్నిటిని కంట్రోల్ చేయడానికి కావలసిన సైన్యాన్ని డిప్లయ్ చేయడానికి ఆయన పిలిచారట. కానీ వీళ్లు వెళ్లకపోవడంతో అక్కడ ఇంత విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA