
ఈ క్రమంలోనే అక్కడ ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ.. ఇక పూర్తిగా నియంత్రణ ధోరణితోనే వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక అక్కడి చట్టాలు మొత్తం తనకు అనుకూలంగా తయారు చేసుకొని ఇప్పుడు పాలన సాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఎవరైనా స్వేచ్ఛ కోసం గొంత్తేతే ఏకంగా వారిని దారుణంగా ప్రాణాలు తీయడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అక్కడ బానిసత్వాన్ని ఎదిరించి పోరాటం చేయడానికి కూడా ఎవ్వరూ ధైర్యం చేయరు అని చెప్పాలి. అయితే మరీ ముఖ్యంగా ఉత్తరకొరియాలో క్రిస్టియన్ల పై అటు అధ్యక్షుడు కిమ్ అరాచకాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మరి ఇంత నీచుడా అని తిట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ పేరుతో యూఎస్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 70000 మంది క్రిస్టియన్లను ప్రభుత్వం జైల్లో పెట్టింది. అయితే ఇలా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో.. రెండేళ్ల బాలిక కూడా ఉందట. మత గ్రంధాన్ని కలిగి ఉంది అనే కారణంతో ఏకంగా ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేసి ఇక జీవిత ఖైదు విధించిందట అక్కడి ప్రభుత్వం. దీంతో రెండేళ్లు చిన్నారి కూడా జీవిత ఖైదు అనుభవించింది.