ఇటీవల కాలం లో సోషల్ మీడియా అనే మాయ లోనే బ్రతికేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమం లోనే సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. కొంతమంది ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ప్రాణాలను పణంగా పెట్టుకుని మరి ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోలు ఇటీవల కాలంలో చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను ఆకట్టుకోవడం కోసం ఏకంగా ఫుల్లుగా మద్యం తాగి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తాగాడు. కానీ ఆ తర్వాతే అతను అనుకున్న ప్లాన్ కాస్త రివర్స్ అయింది. అతనికి ఫాలోవర్స్ పెరుగుతారు అనుకుంటే చివరికి అతని ప్రాణమే గాల్లో కలిసిపోయింది. ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 సాక్కి యంగ్ అనే 34 ఏళ్ళ వ్యక్తి ఒక ఛాలెంజ్ లో భాగంగా టిక్ టాక్ లైవ్ లో ఏడు ఫుల్ బాటిల్స్ వోడ్కా తాగేశాడు   అయితే మద్యం డోస్ పెరిగిపోవడంతో 12 గంటల్లోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు  అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని ఇక అతను తాగిన వోడ్కా లో 60 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందని పేర్కొన్నారు. గతంలోనూ ఇలా లైవ్ లో మద్యం తాగినందుకు అకౌంటు బ్యాన్ అయ్యిందని.. దీంతో అతని పేరుతో మరో అకౌంట్ ఓపెన్ చేసుకొని నడుపుతున్నాడు అనే విషయాన్ని పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: