2020 నాటి జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో భారత జనాభా 47 లక్షలు అని లెక్క తేలింది.  ప్రజలకు 10 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జనాభా లెక్కల విషయంలో ఈసారి మూడు సంవత్సరాల లేట్ అయిందని తెలుస్తుంది. కరోనా వైరస్ తీవ్రత, దాని పరిరక్షణ చర్యలు ఇలాంటి విషయాలన్నిటి వల్ల ఈ సారి నివేదిక మూడేళ్లు ఆలస్యమైందని అంటున్నారు.


మామూలుగా  ఎవరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసమే కష్టపడతారు. అలా కష్టపడి బాగా డబ్బులు సంపాదించాక కూడా భారత దేశంలోనే ఉండడానికి చాలామంది ఇష్టపడడం లేదని పరిశోధనలో తేలింది. అలా భారత్ వదిలి అమెరికాకు వెళ్లి అక్కడ సెట్ అయిన భారత జనాభా లెక్క దాదాపు 47 లక్షలు అని తేలింది. అమెరికాలో అత్యధికంగా ఉండే దేశాల వాళ్ళు ఎవరు అంటే చైనా వాళ్లని తెలుస్తుంది.  వాళ్లే అక్కడ దాదాపుగా 52లక్షల మంది  ఉన్నారని అంటున్నారు.


వాళ్ళ తర్వాత మన భారత్, ఆ తర్వాత ఫిలిప్పీన్స్ వాళ్లు 44లక్షల మంది అక్కడ ఉన్నారట. వారి తర్వాత వియత్నం వాళ్ళు 22లక్షల మంది ఉన్నారట. ఉత్తర అమెరికా, వెనిజులాకి చెందిన జనాభా అమెరికాలో ఇప్పుడు పెరుగుతున్నారని, వాళ్ళ జనాభా అక్కడ 35లక్షలకు పెరిగిందని అంటున్నారు. మాట వరసకి చాలామంది నా దేశం గొప్ప దేశం అని స్టేట్మెంట్లు ఇస్తారు గానీ, ప్రాక్టికల్ గా వచ్చేసరికి తన స్వార్థం కోసం, తన సంపాదన కోసం విదేశాల్లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటారు కొంతమంది అని సామాజిక విశ్లేషకులు  అంటున్నారు.


పేదవాళ్లు ఎటు అమెరికా లాంటి అగ్ర దేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రం ఎక్కువగా ఈ అగ్ర రాజ్యాల వైపుకు వెళుతూ ఉంటారు. ప్రత్యేకించి మధ్యతరగతి వాళ్ళు చదువు నిమిత్తం అమెరికాకు వెళుతూ ఉంటే, ఎగువ మధ్యతరగతి వాళ్ళు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI