అయితే ఆయా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా పడిపోతాయి అన్నదానికి సంబంధించి కళ్లకు కట్టినట్లుగా చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ప్రస్తుతం అక్కడ మైనస్ 64 డిగ్రీల వాతావరణం ఉందని చెప్పాలి ఇంత చలిలో మనుషులు బ్రతకగలరా అని అనుమానం కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే జెఫ్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో మైనస్ 64 డిగ్రీల చలిలో తిరుగుతూ ఉన్నాడు.
ఈ క్రమంలోనే కొంచెం బీరు తాగాలని అనుకున్నాడు. బీర్ క్యాన్ ఓపెన్ చేసి గ్లాసులో బీర్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత జరిగింది చూసి అతను ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు. ఎందుకంటే బీరు ఓపెన్ చేసి గ్లాస్ లో పోసుకుంటుండగా క్షణాల వ్యవధిలోనే బీరు గడ్డ కట్టేసింది. ఏకంగా గ్లాస్ బీర్, క్యాన్ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండిపోయాయి. దీంతో ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అన్నట్లుగా ఈ గడ్డకట్టుకుపోయిన బీర్, గ్లాస్, క్యాన్ ను చూపించాడు ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి