కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్  గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన  గురువారం వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.  ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే కోళికోడ్‌ వెళ్లిన రాహుల్, ప్రియాంక.. ఈ ఉదయం వయనాడ్‌ చేరుకున్నారు. నామినేషన్‌కు ముందు వందలాది మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో రాహుల్‌ భారీ ర్యాలీ చేపట్టారు.

ఇదిలా ఉంటే..కేరళ రాజకీయంలో బాగా పాపులర్ అయిన సోలార్ సరిత ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చింది. సోలార్ సరిత గతంలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు  సంచలనం రేపింది.  అప్పటి కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆమె సెక్సువల్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసి ఈమె ఆ స్కామ్ లో ఒక సూత్రధారిగా నిలిచింది.  అప్పట్లో కేరళాలో నే కాదు దేశ వ్యాప్తంగా సోలార్ స్కామ్ సరిత వల్ల రసవత్తరంగా నిలిచింది. అందుకు సంబంధించిన కేసులు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి.

ఒక రకంగా చెప్పాలంటే సోలార్ స్కామ్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాతి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. కమ్యూనిస్టు పార్టీల కూటమి అక్కడ అధికారాన్ఇన దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సెక్సువల్ చార్జెస్ ఎదుర్కొంటున్న నేతలను టిక్కెట్లు ఇవ్వవొద్దని సరిత..రాహూల్ గాంధీకి పలు మార్లు లేఖలో తెలిపారు. కానీ ఆమె మాటలు భేఖాతర్ చేస్తూ రాహుల్ వాళ్లకు టికెట్లు ఇచ్చారు.  దాంతో ఇప్పుడు రాహూల్ గాంధీపై సరిత చిందులేస్తుంది.  అంతే కాదు  తాను కూడా వయనాడ్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా సోలార్ సరిత ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: