Image result for raja guru advices to chandrababu
తెలుగుదేశం అధినేతకు రాజగురువుగా పేరు పొందిన ఆయనకు ఆదిలో రాజకీయాల్లో తప్పుటడుగులను తప్పటడుగులుగా ప్రచారం చేసి ఇంతదాకా తీసుకువచ్చారు. సామాజిక వర్గ ప్రయోజనాలకోసం నిరంతరం పని చెసే వీరు ఒకరు లేక మరొకరు జీవించనంత జిగినీ దోస్తులు. గురుశిష్యులు. శిష్యుని కోసం ఆ గురువు మీడియాధినేత ఫలితాలపై తన అంచనాలను వెల్లడించేశారట. తన మీడియా హౌస్ ద్వారా పక్కా అంచనాలను తెప్పించుకున్న ఆయన ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమిని అంచనా వేస్తూ ఉన్నారట. ఇవే అంచనాలను తెలుగుదేశం అధినేతకు కూడా ఆ రాజగురువు వివరించినట్టుగా సమాచారం. అదివిన్నప్పటినుండే టిడిపి అధినేత ముఖం వివర్ణం అయిందట. 

ఆ మీడియా మొఘల్ అంచనాల ప్రకారం ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని తేలిందట. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజార్చుకుని వైసిపి కు దాన్ని అప్పగిస్తుందని ఆయన అంచనాల్లో సమగ్రంగా తేలిందట. తెలుగుదేశం పార్టీ ఆరేడు ఎంపీ సీట్లను మించి నెగ్గే అవకాశం లేదని కూడా రాజగురువు అంచనా వేసినట్టుగా  సమాచారం!

రాష్ట్రంలో ఎలాగూ అధికారం చేజారడం పక్కా అయిన నేపథ్యంలో, ఆరేడు సీట్లతో కనీసం కేంద్రంలో అయినా ఏదో ఒక రకంగా ప్రాధాన్యతను దక్కించుకోవాలని చంద్రబాబుకు ఉద్భోదించారట రాజగురువు. ఎలాగూ కేంద్రంలో హంగ్ తరహా పరిస్థితి వచ్చేలా ఉంది. కాబట్టి, ఆరేడు ఎంపీ సీట్లతో అయినా అక్కడ ఏమైనా అవకాశం దక్కుతుందేమో! అనే ప్రయత్నాలు చేయాలని రాజగురువు బాబుకు సూచించారట.

ఏపీ వరకూ అయితే ఆశలు వదిలేసు కోవాల్సిందే - దక్కే కొద్ది పాటి ఎంపీ సీట్లతో అయినా ఏమైనా ప్రయత్నాలు సాగించాలని ఆయన వివరించారట. ఈ విధంగా ఫలితాల పై చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చి తదుపరి అనుసరించాల్సిన మార్గాన్ని సూచించారట ఆయన. ఒకవైపు తెలుగుదేశం గెలుస్తుంది నూటా ముప్పై ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. కాదు నూటా యాభై వస్తాయని అంటూ, చంద్రబాబు నాయుడు అంటున్నా- రాజగురువు మాత్రం అలాంటి మాటలను కట్టి పెట్టి కేంద్రంలో ఏమైనా ప్రాధాన్యత దక్కే అవకాశాలను పరిశీలించుకోవాలని సూచించారట.
Image result for failure face of chandrababu
అయినా ఆరేడు ఎంపీ సీట్లతో కేంద్రంలో అయినా ఏం ప్రాధాన్యత లభిస్తుందబ్బా? ఆయితే రాజగురువు ఆదేశాల ప్రకారం మోడీ శత్రువులతో దోస్తీ చేసి ఏదో “రాజకీయ విన్యాసమో! బ్రోకరేజో!"  చేసైనా అధికార పీఠానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం బాబు. చూద్ధాం కాలం ఏ తీర్పిస్తుందో! 

మరింత సమాచారం తెలుసుకోండి: