ఏంటి భూకంపలు.. ఒక్కసారిగా ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.. అప్పుడెప్పుడో ఇలా భూకంపం పేరు వరుసగా విన్నాం. అలాంటి మనం మళ్ళి ఇప్పుడు ఈ భూకంపం గురించి వినడం ఏంటి? అది కూడా వరుసగా.. నిన్నటికి నిన్న టర్కీలో భూకంపం వచ్చింది.. ఏకంగా 18 మంది ఆ భూకంపంలో మరణించారు.. 550 మందికి గాయాలు అయ్యాయి. 

 

ఇప్పుడు ఏకంగా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి.. హైదరాబాద్ లో కొన్ని చోట్లా వచ్చి ప్రజలను హడలెత్తించింది ఈ భూకంపం. సరిగ్గా ఈరోజు తెల్లవారు జామున రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మొదట నల్గొందా దగ్గరలో రాగా.. ఆ తర్వాత సికింద్రాబాద్, మారేడ్ పల్లి, గచ్చిబౌలి ప్రాంతాలలో గంట వ్యవధిలోనే వచ్చింది. 

 

అయితే ఈ భూకంపం ఒక్క హైదరాబాద్ తోనే ఆగలేదు.. విజయవాడలో కూడా భూకంపాన్ని కనుగొన్నారు.. అయితే మొదట నల్గొండలో మొదలైన ఈ భూకంపం విజయవాడలో కూడా రావడం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆనంద పడాల్సిన విషయం ఏమిటంటే.. 

 

ఈ భూకంపం వచ్చినప్పటికీ తీవ్రత తక్కువ మోతాదులోనే ఉంది. అందుకే ఈ భూకంపం కారణంగా ఏలాంటి ప్రాణ నష్టము జరగలేదు.. ఏలాంటి ఇబ్బంది కలగలేదు.. కానీ ఒక్కసారిగా 7 నుండి 10 సెకండ్ల వరుకు ఈ భూకంపం రావడంతో ప్రజలంతా భయభ్రాంతలకు గురయ్యారు.. ఇళ్ల నుండి బయటకు వచ్చారు. 

 

అయితే ఈ విషయంపై నెటిజన్లు ట్విట్టర్ వేధికగా ట్విట్స్ చెయ్యడం ప్రారంభించారు.. ఏంటి ఈ భూకంపం అని ఒకరు ప్రశ్నిస్తే.. మరొకరు భూకంపం వచ్చినట్టు ఎవరైనా ఫీల్ అయ్యారా ? అని అడుగుతున్నారు.. మరి కొందరు మాత్రం.. నిన్న టర్కీలో భూకంపం వచ్చింది.. నేడు హైదరాబాద్ లో.. మరి రేపు ఎక్కడ వస్తుందో.. అలెర్ట్ గా ఉండలి అని అంటున్నారు ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: