ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో.. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ శాఖ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆర్మీ రోజు రోజుకు మరింత పటిష్టంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఎంతో ఆధునిక టెక్నాలజీ కలిగిన శక్తివంతమైన ఆయుధాలను వివిధ దేశాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు స్వదేశీ వస్తువులను కూడా అభివృద్ధి చేసి మంచి విజయం సాధించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది భారత రక్షణ శాఖ. కాగా  సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ ఎంతో వేగంగా పనిచేస్తుంది అనే విషయం తెలిసిందే .



 ఇప్పటికే అధునాతన టెక్నాలజీతో కూడిన ఏకంగా 13 మిస్సైల్ ని అభివృద్ధి చేసిన భారత రక్షణ పరిశోధన సంస్థ శరవేగంగా వాటికి ప్రయోగాలు నిర్వహించే విజయవంతం అయ్యింది. ఇప్పుడు మరో కీలకమైన ఇటువంటి పరీక్షకు భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వ
అస్త్ర ఎయిర్ కం బ్యాక్ మిస్సైల్ ని ప్రయోగించేందుకు ప్రస్తుతం డిఆర్డిఓ సిద్ధమవుతున్నది . తేజస్ యుద్ధ విమానం నుంచి అస్త్ర మిస్సైల్  ప్రయోగించేందుకు ప్రస్తుతం భారత రక్షణ పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. అయితే తేజస్ యుద్ధ  విమానాన్ని భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసింది అనే విషయం తెలిసిందే.



 ఇలా లైట్ వెయిట్ కలిగిన ఈ యుద్ధ విమానం నుంచి కొత్తగా  అభివృద్ధి చేసిన మిస్సైల్ ని ప్రయోగించేందుకు సిద్ధమైంది డి ఆర్ డి ఓ. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తూ విదేశీ ఆయుధ విక్రయాలను క్రమక్రమంగా తగ్గించడంతోపాటు స్వదేశీ ఆయుదాలను  అభివృద్ధి చేసుకుని అదేవిధంగా ఆయుధ విక్రయాలను కూడా పెంచుకోవడానికి ప్రస్తుతం డిఆర్డిఓ శరవేగంగా పనిచేస్తుంది. ఇక ప్రస్తుతం భారత రక్షణ రంగంలో శరవేగంగా జరుగుతున్నటువంటి మార్పులు ఇది ఎంతో కీలకమైనటువంటివి  అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: