ఇప్పటి వరకూ కనీసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఢిల్లీ వరకూ వెళ్లి మోడీ అపాయింట్ మెంట్ దొరకక వెనుదిరిగాడేమో కానీ.. వైకాపా అధినేత జగన్ కు మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర భారతీయ జనతా పార్టీ నేతల అపాయింట్ మెంట్ సులభంగానే దొరుకుతోంది. ఎన్నికలు అయిన వెంటనే జగన్ ఢిల్లీ పయనం అయ్యాడు. మోడీతో సమావేశం అయ్యాడు!

ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించాకా కూడా జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ లభించింది. తన ఎంపీలతో కలిసి జగన్ ప్రధానిని కలిశాడు. రాష్ట్రపరిస్థితుల గురించి చర్చించడానికి.. రాష్ట్రానికి న్యాయం చేయమని అడగడానికే తను ప్రధానితో సమావేశం అయినట్టుగా గతంలో జగన్ చెప్పాడు.

ఇప్పుడు వైకాపా అధినేత మరోసారి ప్రధానితో సమావేశం కానున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం గురించి ప్రధానితో చర్చించనున్నట్టుగా జగన్ ప్రకటించాడు. ఈ విషయంలో తాము పరిస్థితిని వివరించి కేంద్రం సహకారాన్ని కోరతామని..అందుకే ఢిల్లీ వెళుతున్నట్టుగా జగన్ వివరించాడు.

మరి రెండు రోజుల క్రితమే బాబు ఢిల్లీ వెళ్లొచ్చాడు. మోడీతో ప్రత్యేకంగా సమావేశం కాలేదు కానీ.. వాజ్ పేయికి భారతరత్న పురస్కారాన్ని అందించే కార్యక్రమంలో బాబు మోడీని కలిశాడు. ఇప్పుడు మళ్లీ జగన్ వెళుతున్నాడు. మొత్తానికి తెలుగుదేశం అధినేతకు ధీటుగా వైకాపా అధినేతకు కమలనాథులతో ఈజీగానే అపాయింట్ మెంట్లు లభిస్తున్నట్టున్నాయి! 


మరింత సమాచారం తెలుసుకోండి: