మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గంలో భై ఎలక్షన్ అనివార్యమైన సంగతి మనకు విదితమే. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజకీయాలు రోజురోజుకు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందుకే... అక్కడి నేతలు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ దళిత  సామాజిక వర్గం నుంచి... ఓ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచన చేస్తోంది.

దళిత బందును ఎదుర్కునేందుకు ఇదే ఉత్తమ మార్గం అని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక బిజెపి పార్టీ తరఫున ఈటెల రాజేందర్ లేదా ఆయన సతీమణి ఈటల జమున హుజురాబాద్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే  కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు.. గులాబీ బాస్ కెసిఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రోజుకో నిర్ణయం తీసుకుంటూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకు ఉంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే దళిత బంధు పేరుతో ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హుజురాబాద్ దళిత కుటుంబాల ఓట్లు టీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

 తానే స్వయంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో బహిరంగ సభ నిర్వహించి... ఓటర్లను తమ వైపు తిప్పుకునే లా ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 16న హుజూరాబాద్ నియోజకవర్గం లో బహిరంగ సభను పార్టీ నేతలకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ మరియు కొప్పుల ఈశ్వర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ దగ్గరుండి చూస్తున్నారు. అయితే ఈ బహిరంగ సభలో హుజురాబాద్ ప్రజల పై సీఎం కేసీఆర్ మరోసారి వరాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయితే ఈటల రాజేందర్ పరాభవం తప్పదు. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ మాసంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: