పుతిన్ కు కరోనా  !
అగ్ర రాజ్యాలలో ఒకటైన రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ కరోనా బారిన పడ్డారు. ఆయన మంగళవారం సాయంత్రం నుంచి స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. పుతిన్ చుట్టూ ఉన్న వ్య.క్తులలో ఒకరికి కోవిడ్ సోకింది. దీంతో పుతిన్ కు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆపరీక్షలలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది, దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని మాస్కో నగరంలో రష్యా ప్రభుత్వ భవనం క్రెమ్లిన్ ప్రతినిధులు ప్రసార మాధ్యమాలకు ఒక ప్రకటనలో తెలిపారు.
రష్యా అధ్యక్షుడు మంగళవారం తమ మిత్ర రాజ్యం తజకిస్తాన్  నేత ఎమోమాలి రహ్మాన్త్ తో సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశం వర్చువల్ గా జరిగింది.  క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడుఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అయితే కొంత కాలం పాటు ముఖాముఖి సమావేశాలు రద్దు చేసినట్లు  చెప్పారు.
 ఈ వారంలో రష్యా అధ్యక్షుడు తజకిస్తాన్ లోని దుషాన్బే  నగరంలో షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవ్వాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్  దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆ సమావేశంలో ప్రధాన అజెండా. ప్రస్తుతం నెలకొని ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్య్టా  ఈ సమావేశం వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం రోజు కూడా పుతిన్ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. సిరియా నేత బాషర్ అసద్ కూడా పుతిన్ ను కలిశారు. సైనిక వందనాన్ని కూడా స్వీకరించారు.
 ఈ ఏడాదిలో పుతిన్ రష్యా తయారు చేసి కోవిడ్ -19 టికా స్పుట్నిక్- వి ను రెండు  మార్లు వేసుకున్నారు. టీకా తొలి ప్రయోగాన్ని తనమీద నే చేయించుకున్నారు. తమ దేశంలోని సైనిక సిబ్భంది అందరికీ టీకా వేయించారు. ఈ సందర్భంగా ఆయన తనను తాను  సుప్రీం కమాండర్ గా అభివర్ణించుకున్నారు. టీకా వేసుకున్న సమయంలో తనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదని , స్వల్పంగా జ్వరం వచ్చిందని ప్రకటించారు. ఈ విధంగా అందరిలోను టీకా పై అవగాహన పెంపోందించారు.
అయితే గత కొద్ది వాారాలుగా  రష్యాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. గడచిన 24 గంటల్లో దాదాపు 18 వేల కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి నెలలో కరోనా ప్రారంభమైంది. నాటి నుంచి  ఇప్పటి వరకూ రష్యాలో 1,94,249 మంది మృత్యువాత పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: