ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరుగుతుంద‌ని, గంజాయి అక్రమ రవాణాపై తాజాగా జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్వీట్స్ చేశారు.  రాష్ట్రంలో గంజాయి ముఠాల కట్టడికి అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కావాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ కు కేంద్రంగా మారిన‌ది. ప్రతీ స్థాయిలోనూ డ్రగ్ మాఫియాలు రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నాయని వెల్ల‌డించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలో ఉన్న నేతలు కావాలని చర్యలు చేపట్టకపోవడమే అని పేర్కొన్నారు. అందుకే వివిధ రాష్ట్రాల ఐపీఎస్ అధికారులు ఏపీలో గంజాయి రవాణా పై చేసిన వీడియోలను పోస్టు చేస్తున్నాం.

ఆంధ్ర- ఒడిశా  బోర్డర్ లో నేను చేప‌ట్టిన‌ యాత్ర సమయంలో కూడా నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ప్రధానంగా గంజాయి వ్యాపార మాఫియా వంటి అంశాలపై ప‌లు ఫిర్యాదులు అందాయి అని గుర్తు చేశారు. ఇక్కడ విభిన్నమైన నేరపూరిత ముఠాలు ఉన్నాయని.. అక్కడి స్థానిక ప్రజలు తెలిపారు. ముఠా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని, చదువు పూర్తయిన కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు.కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని తెలిపారు. అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్లుతుంది. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు.  కానీ ఇప్పుడు అది వ‌దిలేశారు. కేవ‌లం బయటకు వెళ్లే గంజాయిని మాత్ర‌మే పట్టుకుంటున్నారు. ఇక్కడ సీజ్ చేసిన దాని కంటే, రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటుంద‌ని వివ‌రించారు.

 హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్  ఏపీలో నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు వెళ్ళే రూట్ మ్యాప్ ను వివరించారు. రోడ్డు మార్గం ద్వారా నక్కపల్లి క్రాస్ రోడ్డు మీదుగా అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, కర్ణాటకలోని ఉమ్నాబాద్, అహ్మద్ నగర్ కు వెళ్తుందని సీపీ తెలిపారు. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కూడా విలేక‌ర్ల స‌మావేశంలో గంజాయి ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ జిల్లా నుంచి వస్తుందని ప్రకటించారు. కేరళలోని షాడో పోలీస్ విభాగం గంజాయి ముఠాలను అరెస్ట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి ప్రాంతం నుంచి సరఫరా అయినట్టు ప్రకటించింది. మధ్యప్రదేశ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయి వచ్చినట్లు మీడియాకు తెలిపారు. పుణె, ముంబైల్లో పట్టుపడిన గంజాయి అంతా విశాఖపట్నం నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు చెప్పారు. రాజస్థాన్ పోలీసులు పట్టుకొన్న గంజాయి కూడా విశాఖపట్నం నుంచి వచ్చినట్లు గుర్తించారు.  దేశ రాజధాని ఢిల్లీలో ఏసీపీ సంతోష్ కుమార్ మీనా మీడియాకు గంజాయి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి చేరినట్లు తెలిపారు. వీట‌న్నింటిపై ప్ర‌భుత్వం స్పందించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం అయ్యాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: