చైనా దూకుడు... మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. పొరుగు దేశాలపై పెత్తనం చేసేందుకు డ్రాగన్ కంట్రీ కుయుక్తులు పన్నుతూనే ఉంది. అటు భారత సరిహద్దుల్లో ఇప్పటికే కవ్వింపు చర్యలకు చైనా పాల్పడుతూనే ఉంది. తూర్పు లఢాక్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చేతుల్లో చావు దెబ్బలు తిన్న డ్రాగన్ ఆర్మీ... ఇప్పుడు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో మాటు వేసింది. అదే సమయంలో భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్నే తమదని వాదిస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కూడా తప్పుబట్టింది డ్రాగన్ కంట్రీ. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నా కూడా... డ్రాగన్ కంట్రీ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత్‌ను రెచ్చగొట్టేందుకు రోజు రోజుకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాస్తవాధిన రేఖ సమీపంలో... ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

సరిహద్దుల్లో యుద్ధ వాతావారణానికి కారణమైన చైనా... ఇప్పటికీ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీనిపై ఇప్పటికే కమాండర్ స్థాయి చర్చలు జరిగిన కూడా... ఫలితం ఏ మాత్రం కనిపించడం లేదు. సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరిస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ. అదే సమయంలో భారీ నిర్మాణాలు కూడా చేపడుతోంది. సరిహద్దుల వరకు వేగవంతమైన ప్రయాణం కోసం బుల్లెట్ రైల్వే ట్రాక్ కూడా ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ. టిబెటి రీజియన్‌లో భారీ నిర్మాణాలు చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. అత్యవసర పరిస్థితుల కోసం హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఈ విషయంపై ఓ నివేదిక అందించింది. సుప్రీం కోర్టులో ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నివేదికను సమర్పించారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. తన పరిధిని చైనా క్రమంగా విస్తరిస్తోందని కూడా అటార్నీ జనరల్  నివేదికలో స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: