కాంగ్రెస్ ప‌రిపాల‌న‌తో విసిగిపోయిన దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించిన‌ మ‌హానేత అట‌లీ బీహారి వాజ్‌పేయి అని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన సెమినార్ లో పాల్గొని మీడియాతో మాట్లాడారు బండి సంజ‌య్‌. పార్టీ జెండాను న‌మ్ముకుని 60 ఏండ్ల రాజ‌కీయ జీవితాన్ని గ‌డిపిన ఆద‌ర్శ‌మూర్తి, 50 ఏండ్లు ఎంపీగా, 5 సార్లు జాతీయ అధ్య‌క్షులుగా కొన‌సాగిన నేత వాజ్‌పేయి అని  కొనియాడారు.

డ‌బ్బుల‌తోనే రాజ‌కీయాల‌ను శాసిస్తూ.. పార్టీలు మారుతున్న ఈకాలంలో కార్య‌క‌ర్త‌ల‌ను సిద్ధాంతాల‌ను న‌మ్ముకుని దేశానికి సుప‌రిపాల‌న అందించిన మ‌హానేత వాజ్‌పేయి రాజ‌కీయ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌మ‌ని వివ‌రించారు. ఇక అద్వానీ, వాజ్‌పేయి అత్యంత స్నేహ‌పూర్వ‌క సంబంధాలు అంద‌రికీ ఆద‌ర్శం అన్నారు.

గులాబీ చెట్టుకు ముళ్లు, పూల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవని బండి గుర్తు చేసారు. కార్గిల్ యుద్ధంలో విజ‌యం సాధించి పాకిస్తాన్ ను దోషిగా నిల‌బెట్టిన ఘ‌న‌త అట‌లీ బీహారీ వాజ్‌పేయికి ద‌క్కిన‌ద‌ని పేర్కొన్నారు. దుష్ట కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మైనార్టీల ఓట్ల కోసం బీజేపీపై అనేక విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ.. న‌మ్ముకున్న సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉంటాం అని, ఇజ్రాయిల్‌తో దౌత్య‌సంబంధాలు నేర్పిన నాయ‌కుడంటూ వాజ్‌పేయిను కొనియాడారు.

మ‌రోవైపు స్టాండ్ ఆఫ్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీని హైద‌రాబాద్‌కు ఆహ్వ‌నించ‌డంపై మండిప‌డ్డారు బండి సంజ‌య్‌. దుర్గ‌మ్మ‌ను, సీత‌మ‌మ‌, శ్రీ‌రామ చంద్రుడిని అవ‌మానించిన మూర్ఖుడు స్టాండ్ ఆఫ్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ అని దుయ్య‌బ‌ట్టారు. మూర్కుడినీ కేటీఆర్ రాష్ట్రానికీ ఆహ్వానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. భ‌యంక‌ర‌మైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్ ముందుగా నాస్తికుడైన కొడుకు కేటీఆర్‌ను క‌ట్టడి చేయాల‌ని సూచ‌న‌లు చేసారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులంద‌రూ సాస్తికులు అంటూ మండి ప‌డుతూ.. యువ‌త మోర్చ నేత‌లు మునావ‌ర్ ఫారూఖీని తెలంగాణ‌లో అడుగు పెట్ట‌కుండా అడ్డుకోవాల‌ని బండి సంజ‌య్‌ పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: