రాజకీయాల్లోకి వారసులు రావడం అనేది సహజంగా జరిగే ప్రక్రియే...ప్రతి సీనియర్ నాయకుడు వారసుడు రాజకీయాల్లోకి రావాలనే చూస్తారు. ఇప్పుడు ఏపీలో ఎంతమంది రాజకీయ వారసులు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు జగన్ వారసుడే...అటు లోకేష్ వారసుడే. కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలు మామూలే. అయితే వారసులు లేనివారి వారసురాళ్ళని బరిలో దింపుతారు. అలా ఏపీలో కొందరు నేతలు తమ వారసురాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

అయితే ఇందులో కొంతమందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇంకా దొరకలేదు. కొంతమందికి పోటీ చేసే అవకాశాలు దొరికాయి. ఇక పోటీ చేయడానికి అవకాశం దొరకని వారు...ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వారు కూడా టిక్కెట్లు ఇస్తే పోటీ చేయాలని చూస్తున్నారు. అలా టీడీపీలో పలువురు పోటీకి రెడీ అవుతున్నారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టీడీపీలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఆమె సీటు కూడా ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో తన తల్లికి సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. కానీ ఈ సారి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. రాజాం సీటు కోసం మాజీ స్పీకర్ వారసురాలు గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆ సీటులో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. ఆయన మొన్నటివరకు యాక్టివ్‌గా లేరు గానీ...ఇప్పుడు కాస్త అక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు రాజాం సీటుని కొండ్రుకే ఫిక్స్ చేస్తారా? లేక మాజీ స్పీకర్ వారసురాలుకు ఫిక్స్ చేస్తారనేది చూడాలి.

అటు కర్నూలు జిల్లాలో సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వారసురాలు సైతం టీడీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఏవీ జస్వంతిరెడ్డి టీడీపీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఇంతవరకు ఏవీకే సీటు ఇవ్వలేదు. నంద్యాల గానీ, ఆళ్లగడ్డ గానీ కావాలని చెప్పి ఏవీ ట్రై చేస్తున్నారు. కానీ రెండు చోట్ల భూమా ఫ్యామిలీ ఉంది. మరి ఏవీ వారసురాలుకు సీటు వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: