కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. సరి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అటు వ్యవసాయ రంగంలో కూడా వినూత్నమైన మార్పులను తీసుకు వచ్చి అధునాతన  టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో వినూత్నమైన యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం.


 సాధారణంగా పంట పొలాల్లో వివిధ రకాల ఎరువులు మందులు ఎలా పిచికారీ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైతులు భుజాన వేసుకుని ఎంతో కష్ట పడుతూ పిచికారీ చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి పంటపొలాల్లో పురుగుల మందులు పిచికారి డ్రోన్ ద్వారా జరగబోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల వంద కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇక దేశంలోని వివిధ నగరాలు పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా రైతులకు  పిచికారి పనులు సులభతరం అయ్యే అవకాశం ఉంది.



 ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే రెండు సంవత్సరాలలో గరుడ ఏరోస్పేస్ కింద దాదాపు లక్ష దేశీయ తయారీ డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను తీసుకువస్తుందని మోడీ చెప్పుకొచ్చారు. ఇక ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇది కొత్త అధ్యాయంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. ఇదే సమయంలో ఆర్థిక బడ్జెట్ గురించి మాట్లాడిన ఆయన.. వార్షిక బడ్జెట్లో నిర్మల సీతారామన్ వ్యవసాయరంగానికి మేలు చేసే బడ్జెట్లో కేటాయించారని చెప్పుకొచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో డిజిటల్ హైటెక్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులందరికీ వ్యవసాయ మరింత సులభతరం అయ్యేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మోడీ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: