ఉత్తర్ ప్రదేశ్ లో అజామ్ గడ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలి, వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలు. మూడు రోజుల పాటు వారణాసి లో ప్రచారం చేశారు ప్రధాని మోడి.  సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తన భాగస్వామ్య పక్షమైన “రాష్ట్రీయ లోక్ దళ్” ( ఆర్.ఎల్.డి) అధినేత జయంత్ చౌధురి తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తో కలిసి సంయుక్తంగా ర్యాలీ లు నిర్వహణ ఉండటనుంది.   పూర్వాంచల్ ప్రాంతంలో ప్రచారం చేసిన “బహుజన సమాజ్ పార్టీ” అధినేత మాయావతి...  యుపిలో  కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేసేందుకు విస్తృతంగా  రోడ్ షో లతో పాటు, కాశీ విశ్వనాధ్ ఆలయాన్ని కూడా సందర్శించి, పూజలు చేశారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె సోదరుడు రాహుల్ గాంధీ.  

11 ఎస్.సి స్థానాలు, రెండు ఎస్.టి స్థానాలతో పాటు మొత్తం 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి తన భాగస్వామ్య పక్షాలైన “అప్నా దళ్”, ఎస్.బి.ఎస్.పి తో కలిసి 29 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్ వాది పార్టీ 11 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 6 స్థానాల్లో గెలుపు ఉంది.  బిజేపి భాగస్వామ్య పక్షాలు అప్నాదళ్ ( సోనేలాల్), “నిషాద్ పార్టీ” లకు,  సమాజ్ వాది పార్టీ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్ ( కమేరావాడి), “సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ” ( ఎస్.బి.ఎస్.పి) లకు ఈ విడత ఎన్నికలు పెద్ద సవాల్‌ గా మారింది. “మౌ సదర్” అసెంబ్లీ స్థానం నుంచి ముక్తార్ అన్సారి కుమారుడు
అబ్బాస్ అన్సారి పోటీ ఉండనుండగా... జహూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి “సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ” అధినేత ఓం ప్రకాష్ రాజ్ భర్ పోటీ ఉంది. ఈ విడతలో ఎన్నికలు బిజేపి కి అత్యంత కీలకం, ప్రతిష్ఠాత్మకం. ప్రధాన మంత్రి మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోకసభ స్థానం పరిధిలో పోటీ లో ఉన్నారు ముగ్గురు రాష్ట్ర మంత్రులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

up